Ghee Coffee or Bullet Coffee : బుల్లెట్ కాఫీ ట్రై చేశారా ఎప్పుడైనా? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వెంటనే తాగేస్తారు
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి కొత్తగా అంటారా? దీన్ని బుల్లెట్ కాఫీ లేదా నెయ్యి కాఫీ అని కూడా అంటారు. దానికి కారణం.. ఈ కాఫీని మామూలుగా పంచదార, కాఫీ ఫౌడర్ వేసి చేయరు. దీని కోసం ప్రత్యేకమైన పదార్థాలు ఉంటాయి. అవే నెయ్యి, దాల్చిన చెక్క, పసుపు.
#image_title
కాఫీ, టీలు తాగడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కానీ.. కొందరికి పొద్దున లేస్తే కాఫీ, టీలు ఖచ్చితంగా తాగాల్సిందే. అటువంటి వాళ్లు ఈ బుల్లెట్ కాఫీని ట్రై చేయొచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలి.. దీన్ని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలకు ఏకంగా కార్డియాలజీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన డాక్టర్ అలోక్ చోప్రా ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఆయన రోజు ఉదయం ఈ బుల్లెట్ కాఫీని తాగుతారట. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా చెప్పుకొచ్చారు.
Ghee Coffee or Bullet Coffee : బుల్లెట్ కాఫీ తయారు చేసే విధానం
ఈ కాఫీని ఎలా తయారు చేసుకోవాలంటే.. ఒక కప్పులో బ్లాక్ కాఫీ పోసి.. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. దాల్చిన చెక్క, చిటికెడు పసుపు కలుపుకొని తాగితే మామూలుగా ఉండదట. ఇది అన్ని రకాల జబ్బులను నయం చేసే కాఫీ అని ఆ డాక్టర్ అభివర్ణించారు.
మెదడు పనితీరు మెరుగుపడాలన్నా, నిరంతరం శక్తిని పొందాలన్నా, బరువు తగ్గాలన్నా, మానసిక స్థితిని మెరుగు పరుచుకోవాలన్నా, గట్ ఆరోగ్యం మెరుగుపడాలన్నా, యాంటీ ఆక్సిడెంట్స్ కావాలన్నా.. ఈ కాఫీని రోజూ తీసుకోవాలని డాక్టర్ సూచించారు.