Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు. పక్కన ఉన్నవారు ఎవరైనా చెబితే కానీ తాము గురక పెడుతున్నట్టు తెలియదు. డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు కూడా గురక వస్తుంది కావచ్చు అని చాలామంది అనుకుంటారు. కానీ.. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు గురక పెడతారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
#image_title
ఇంకొందరు ఏమనుకుంటారంటే.. లావుగా ఉన్నవాళ్లు, ఊబకాయంతో బాధపడేవాళ్లు గురక పెడతారు అనుకుంటారు. కానీ.. కొందరికి నిద్రపోయాక తమ ముక్కు రంధ్రం మూసుకుపోతుంది. దాని వల్ల శ్వాస ఆడటం ఇబ్బంది అయి గురక వస్తుంది. దాన్నే అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటారు.
ఈ సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. దీన్నే నిద్రలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటం అని కూడా అంటారు. ఇది అధిక బరువు ఉన్నవాళ్లకే కాదు.. హైబీపీ, షుగర్ ఉన్నవాళ్లకు కూడా గురక సమస్య ఉంటుంది.
ఈ సమస్య వల్ల నిద్ర లేచిన తర్వాత తలనొప్పి రావడం, లేవగానే నీరసంగా ఉండటం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఎక్కువగా స్ట్రెస్‌కు గురయ్యే వాళ్లు, టెన్షన్ తో ఉండేవాళ్లు, గుండెకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నవాళ్లకు గురక వస్తే మాత్రం భవిష్యత్తులో వాళ్లకు హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
ఇలా నిద్రలో శ్వాస సమస్యను ఎదుర్కునే వాళ్లు సీపీఏపీ అనే మాస్క్ ను ఉపయోగిస్తే బెటర్. ఆ మాస్క్ ని రాత్రి పూట ముక్కుకు అమర్చుకొని పడుకుంటే శ్వాస ఈజీగా తీసుకోవచ్చు. దాని వల్ల గురక రాదు. నిద్ర లేచాక చాలా ప్రశాంతంగా ఉంటారు.