Mekapati Chandrasekhar Reddy : షాకింగ్ ఆసుపత్రి లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి..!
Mekapati Chandrasekhar Reddy : ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కీ పాల్పడ్డారని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేయడం తెలిసిందే. దాదాపు నలుగురిని వైసీపీ హై కమాండ్ సస్పెండ్ చేయడం జరిగింది. అయితే తాను మొదటినుంచి జగన్ తో పాటు రాజకీయంగా కీలక సమయంలో నడిచిన వ్యక్తిని.. అంటూ సస్పెండ్ చేయడం పట్ల మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనని అందరి ముందు తనకి చెప్పి అవమానించారని బోరుమన్నారు.
క్రాస్ ఓటింగ్ వేసినానంతరం బెంగళూరు వెళ్ళిపోయినా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని సొంత పార్టీ నేతలు గట్టిగానే టార్గెట్ చేయడం జరిగింది. దీంతో ఆయన నిన్న ఉదయగిరి బస్టాండ్ వద్ద తన ప్రత్యర్ధి చేజర్ల సుబ్బారెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఉదయగిరి నుంచి తనను వెళ్లగొడతామంటూ సవాళ్లు.. చేసిన వాళ్ళు ఎక్కడ అని హల్ చల్ చేశారు. దీంతో మేకపాటి వ్యాఖ్యలపై స్పందించిన సుబ్బారెడ్డి ఈరోజు ఉదయం 10 గంటలకు బస్టాండ్ సెంటర్ కి వస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఉదయగిరి బస్టాండ్ సెంటర్ వద్ద ఏం జరుగుతుందో అని అందరూ టెన్షన్ తో ఉన్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గుండె నొప్పితో అస్వస్థతకు గురై చెన్నై ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పటికే రెండుసార్లు హార్ట్ అటాక్ రావడంతో స్టంట్స్ వేయించుకుని కోలుకుంటున్న ఆయన.. తాజా రాజకీయ పరిణామాలతో టెన్షన్ కు గురైనట్లు తెలుస్తోంది.