Mekapati Chandrashekar Reddy : సవాల్ లేదు బొక్క లేదు.. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైరల్ కామెంట్స్..!!
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో సస్పెండ్ అయిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మొన్న ఉదయగిరి బస్టాండ్ వద్ద హల్చల్ చేయడం తెలిసిందే. దమ్ముంటే రండి అంటూ స్థానిక వైసీపీ నేతలకు సవాలు విసిరారు. ఆ తర్వాత స్థానిక వైసీపీ నేతలు ఉదయగిరి బస్టాండ్ వద్దకి రాగా.. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అస్వస్థత గురికావడంతో చెన్నై హాస్పిటల్ లో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ క్రమంలో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇంటి వద్ద మీడియా సమావేశం నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం వాళ్ల చేతుల్లో ఉంది.. ఏదైనా చేయగలరు. కానీ ఉదయగిరి ప్రజలు అంతా గమనిస్తున్నారు అని పేర్కొన్నారు.
2024లో తానే పోటీ చేయబోతున్నట్లు ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న టైంలో నాలుగున్నర సంవత్సరాలు ఇంకా అధికారం ఉన్నాగాని అన్ని విడిచిపెట్టి జగన్ వెంట నడిచాను. ఆ సమయంలో నాకున్న పలుకుబడుతూ నేను ఎంతగానో నియోజకవర్గానికి చేయాలి. కానీ రాజకీయంగా జగన్ వెంట నడవడానికి సిద్ధపడ్డాను. ఈరోజు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయగిరి నియోజకవర్గనీ తాను ఎంతగా అభివృద్ధి చేయటం జరిగిందో… ప్రజలకు తెలుసని అన్నారు. ఇరుకుగా ఉన్న రోడ్లను తాను అధికారంలోకి వచ్చాక.. విస్తరణ చేపట్టడం జరిగిందని స్పష్టం చేశారు. తన వల్ల సహాయం పొందిన వ్యక్తులే ఈరోజు వెన్నుపోటుకు
గురి చేస్తున్నారు. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు నాపై చేస్తున్నారు అని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బాధపడ్డారు. అనారోగ్యం కారణంగా ఎక్కువ మాట్లాడలేకపోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే మూడు స్టంట్స్ వేశారు. రాజకీయాలు చేయాలంటే ఆరోగ్యం బాగుండాలి అని అన్నారు. ఎవరేలాగా మాట్లాడుతున్నారో ఉదయగిరి ప్రజలు అంత గమనిస్తున్నారు.. వాళ్లే న్యాయం తీరుస్తారని అన్నారు. సవాల్ గివల్ ఏం లేదు ప్రజలు అంతా గమనిస్తున్నారు..అంటూ మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తాను మొదటి నుంచి పోరాడుతూనే ఉన్నట్లు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆరోగ్యం సహకరిస్తే మళ్లీ పోటీ చేస్తా లేదా యధావిధిగా కుటుంబంతో కలిసి ఉంటానని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు.