Health Tips | మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే శరీరంపైనా తీవ్ర ప్రభావం ..నిపుణుల హెచ్చరిక
Health Tips | ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 7 మందిలో ఒకరు ఏదో ఒక రకమైన మానసిక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. నిరంతర ఒత్తిడి, నిద్రలేమి, ప్రతికూల ఆలోచనలు, సామాజిక ఒంటరితనం, కుటుంబం లేదా వ్యక్తిగత సమస్యలు మానసిక ఆరోగ్యం క్షీణించడానికి ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు.

#image_title
ఇవి తప్పక చేయండి..
డాక్టర్ విశ్వకర్మ వివరించిన ప్రకారం, మానసిక సమస్యలు మొదలైనప్పుడు నిరాశ, ఆందోళన, ఒత్తిడి, తక్కువ ఆత్మవిశ్వాసం, నిద్ర , ఆకలి అసమతుల్యత వంటి సమస్యలు మొదలవుతాయి. ఇవి చదువులు, ఉద్యోగం, వ్యక్తిగత సంబంధాలను దెబ్బతీస్తాయి. దీర్ఘకాలికంగా మానసిక ఆరోగ్యం క్షీణిస్తే, ఆత్మహత్య ఆలోచనలు, ప్రతికూల ప్రవర్తన ప్రమాదం కూడా పెరుగుతుందని హెచ్చరించారు.మానసిక ఆరోగ్య సమస్యలు కేవలం మనసులోనే కాదు, శరీరంపైనా తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిపుణుల సూచనలు:
* ప్రతిరోజూ తగినంత నిద్రపోవాలి.
* ధ్యానం, యోగా వంటి సాధన అలవాటు చేసుకోవాలి.
* సోషల్ మీడియా వినియోగాన్ని పరిమితం చేయాలి.
* విశ్వసనీయ వ్యక్తులతో మనసులోని భావాలను పంచుకోవాలి.
* వ్యాయామం, శారీరక శ్రమను దినచర్యలో చేర్చుకోవాలి.
* అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోవాలి.
* మద్యపానం, ధూమపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి.