KCR : టీఆర్‌ఎస్ కు ఆయుదం.. ఏపీ, తెలంగాణ మళ్లీ కలిపేస్తారు
KCR : తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టే విధంగా బిజెపి వ్యూహాలు పన్నుతోంది. కేంద్రం నుండి మంత్రులు కూడా వచ్చి రాష్ట్రంలో మీటింగ్ నిర్వహించి అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ ప్రజల్లో టీఆర్‌ఎస్ కు నష్టం కలిగించే విధంగా మాట్లాడుతున్నారు. దాంతో టీఆర్ఎస్ నాయకులు కూడా ప్రతి దాడికి సిద్ధమయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ పై సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం కోసం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. ఆ సమయంలో తీవ్ర స్థాయిలో మోడీ గురించి కేసీఆర్ మాట్లాడిన విషయం కూడా అందరికి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ పై కేసీఆర్ మాట్లాడిన తర్వాత రెండు పార్టీల మధ్య దూరం మరింత పెరిగింది అంటూ క్లారిటీ వచ్చేసింది.ఈ సమయంలో పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఏపీకి అన్యాయం జరిగింది.
తెలంగాణ నుండి విడిపోవడం ద్వారా ఏపీ చాలా నష్టపోయింది అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు ఏపీ లో బీజేపీకి సానుభూతి కలిగించేలా ఉన్నాయి. ఏపీలో బీజేపీ మళ్లీ పావులు కదిపే విధంగా ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలోనే మోడీ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కేసీఆర్ అండ్ పార్టీ వర్గాల వారు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కేటీఆర్ ఒక మీటింగ్ లో మాట్లాడుతూ బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే కచ్చితంగా మళ్లీ తెలంగాణ ని తీసుకువెళ్లి ఏపీ లో విలీనం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏపీకి అన్యాయం జరిగిపోయింది అంటూ తెగ బాధ పడుతున్న బీజేపీ నాయకులు అవకాశం వస్తే తెలంగాణను వాళ్లు అమ్మేస్తారంటూ కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు.ఒక నాలుగు రోజులు బీజేపీకి తెలంగాణలో అధికారమిస్తే
మొత్తం పరిస్థితి మళ్లీ పాత రోజుల్లోకి మారే అవకాశం ఉందని అన్నారు. బిజెపి చేస్తున్న లొల్లికి యువత బెండ్ అయ్యి ఆలోచన చేస్తే రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుందని.. రాష్ట్రం మొత్తం మళ్లీ ఆగమవుతుందని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆంధ్రాలో తెలంగాణను కలుపుతారు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఆ పాయింట్ తెలంగాన జనాల్లో కూడా ఆలోచన కలిగించే విధంగా ఉంది. అందుకే అజెండాతోనే బిజెపి పై పోరాటానికి టిఆర్ఎస్ కార్యకర్తలు సన్నద్ధం కావాలని పార్టీ నాయకులు సూచిస్తున్నారు. బిజెపి మరియు టిఆర్ఎస్ ల మధ్య దూరం మరింత పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెసు దానిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.