KTR : 50 లక్షల ఇల్లు ఫ్రీగా ఇస్తున్నాం కేటిఆర్
KTR : తెలంగాణాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ముందుకు వెళ్తుంది. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను ఎలా అయినా సరే అందించాలనే లక్ష్యంతో భారీగా నిధులు కేటాయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టి లబ్దిదారులకు ఇస్తుంది. దీనిపై విపక్షాల ఆరోపణలు తీవ్రంగా ఉన్నా సరే వెనక్కు తగ్గడం లేదు.
తాజాగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను మంత్రి కేటీఆర్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇందిరా నగర్ లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు…. ఎక్కడ ఇంత డిమాండ్ ఉండదు అని అన్నారు. మెయిన్ సెంటర్ పాయింట్ లో పేదలకు ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తున్నాం అని పేర్కొన్నారు.మార్కెట్ లో 50 లక్షల రూపాయల విలువ చేసే ఇళ్ళు ఫ్రీ గా ఇస్తున్నామన్నారు
మంత్రి. 9714 కోట్ల రూపాయల తో హైద్రాబాద్ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కడుతున్నాం అని పెర్కొన్నాఉ. వారం రోజుల్లో కొల్లూర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు అని ఒకే చోట 15640 డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించాం అని పేర్కొన్నారు. 18 వేల కోట్ల రూపాయల తో రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కడుతున్నామన్నారు.