Perni Nani : మా మంత్రి చనిపోయి మేము బాధలో ఉంటే ఇంత నీచంగా ప్రవర్తిస్తారా?
Perni Nani : తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మరియు ఆయన తనయుడు నారా లోకేష్ ల పై ఏపీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలుగు దేశం పార్టీ నాయకులు భీమ్లా నాయక్ సినిమా ను వెనకేసుకు వస్తూ ఏపీ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలపై మంత్రి నాని మండి పడ్డారు. పవన్ కళ్యాణ్ సినిమా ను తొక్కేసేందుకు వైకాపా ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందని.. ఏపీలో ఆ సినిమాని ఆడకుండా చేసేందుకు చాలా ప్రయత్నాలే చేస్తోంది అంటూ తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు మరియు నారా లోకేష్ ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ సినిమాకు మద్దతుగా నిలుస్తున్నామం అంటూ ప్రకటించారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ టికెట్ల విషయమై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.కొత్త జీవో తీసుకొచ్చేందుకు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్ని నాని గతంలో ప్రకటించాడు.
సీఎం జగన్ ను పలువురు సినీ ప్రముఖులు కలిసిన సందర్భంలో కూడా జీవో తీసుకొస్తామని టికెట్ రేట్లు పెంచేందుకు జీవో ఇస్తామని ప్రకటించారు. అతి త్వరలోనే టికెట్ల రేట్లు పెరుగుతాయని భావిస్తున్నారు. సమయంలో ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి చెందారు. దాంతో టికెట్ల రేట్లు పెంపు సంబంధించిన జీవో విడుదల ఆలస్యమవుతోంది. ఈలోపే విడుదలైన భీమ్లా నాయక్ సినిమా పాత టికెట్ల రేటుతోనే విడుదల చేయాల్సి వచ్చింది. దాంతో ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియాలో రచ్చ చేస్తున్నారు.మరో మూడు రోజుల్లో లేదంటే వారం రోజుల్లో కొత్త జీవో వచ్చి ఉండేది. కొత్త జీవో వచ్చిన తర్వాత సినిమా విడుదల చేసుకుంటే బాగుండేది కదా.. అప్పుడే విడుదల చేసి ఎందుకు వివాదం సృష్టించే ప్రయత్నం చేశారంటూ మంత్రి ప్రశ్నించాడు. వారు తొందరడి దానికి ప్రభుత్వాన్ని విమర్శించడం దేనికి అంటూ పేర్ని నాని ప్రశ్నించాడు.

minister perni nani comments on bheemla nayak movie tickets rates
మా మంత్రి చనిపోయి ఉన్నాడు.. మా బాధల్లో మేము ఉన్నాము. ఈ సమయంలో సినిమాల కోసం జీవోలను తీసుకురావాలా అంటూ మంత్రి పేర్ని నాని మండిపడ్డాడు. రెండు రోజుల్లోనే కొత్త జీవితాన్ని తీసుకువస్తాం టికెట్ల రేట్లు కచ్చితంగా పెరుగుతాయి అంటూ పేర్నినాని హామీ ఇచ్చాడు. ఏడాది కాలం పాటు వాయిదా వేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు సినిమాని ఇంకో వారం రోజులు వాయిదా వేసుకుంటే పోయేదేముంది. మాపై బురద చల్లడం కోసమే తన సినిమా ను పవన్ కళ్యాణ్ రిలీజ్ చేశాడని నాని ఆరోపించాడు. ఇప్పటికైనా గౌరవపూర్వకంగా వ్యవహరించాలని.. మా ప్రజాప్రతినిధులపై దాడి వద్దంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు జనసేన కార్యకర్తలకు మంత్రి పేర్ని నాని హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయాన్ని వివాదం చేయాలనే ఉద్దేశంతోనే జీవో విడుదల కాకముందే పవన్ భీమ్లా సినిమా విడుదల చేశారు అంటూ వైకాపా నాయకులు ఆరోపిస్తున్నారు.