Minister Roja : బాదుడు గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది.. మంత్రి రోజా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Minister Roja : బాదుడు గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది.. మంత్రి రోజా

 Authored By prabhas | The Telugu News | Updated on :5 May 2022,7:00 am

Minister Roja : ప్రతిపక్ష నాయకుడు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై మంత్రి రోజా మరోసారి ఫైర్‌ అయ్యారు. ఇటీవల చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించాడు. సామాన్యులపై ధరల భారం వేస్తూ బాదుడే బాదుడు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అంటూ విమర్శలు చేశారు. ఆయన విమర్శలకు పలువురు మంత్రులు గట్టి సమాధానం ఇచ్చారు. గతంలో మీ హయాంలో ఉన్న బాదుడు గురించి మర్చి పోయారా బాబు గారు.. మీరు మర్చి పోయినా కూడా జనాలు ఆ బాదుడు గురించి మర్చిపోలేదు. అందుకే మీకు ప్రతిపక్ష హోదా కట్టబెట్టారని మంత్రులు ఎద్దేవ చేస్తున్నారు.

మంత్రి రోజా మాట్లాడుతూ.. జగన్‌ గారి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు మరియు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందంటూ రోజా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా బాదుడు గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే నవ్వు వస్తుంది అన్నట్లుగా రోజా వ్యాఖ్యలు చేశారు. గతంలో వ్యాట్‌.. ప్రైవేటీకరణ.. విద్యుత్‌ చార్జీలు ఇలా ప్రతి విషయంలో కూడా సామాన్యులను బాదినది చంద్రబాబు కాదా అంటూ ఆమె ప్రశ్నించారు.

Minister Roja comments on chandrababu naidu

Minister Roja comments on chandrababu naidu

బాబు మరియు జగన్ పరిపాలనలో జరిగిన అభివృద్ది మరియు సంక్షేమం గురించి రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు గారు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని భావించారు. అందుకోసం చర్చలు కూడా జరిపారు. కాని నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకుని లాభాల్లోకి తెచ్చిన ఘనత జగన్‌ ప్రభుత్వంది అన్నారు. విద్యుత్‌ చార్జీలు పెంచిన సమయంలో రైతులు ఆందోళన చేస్తుండగా కాల్చి చంపిన ప్రభుత్వం మీది కాదా.. ఇప్పుడు రైతులకు ఉచిత విద్యుత్‌ ను అందిస్తున్నట్లుగా ఆమె పేర్కొన్నారు. ఏ ఒక్క విషయంలో కూడా జగన్ అన్న పరిపాలన గురించి చంద్రబాబు కు మాట్లాడే అర్హత లేదని రోజా అభిప్రాయం వ్యక్తం చేశారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది