Minister Roja : జగన్ కాలర్ ఎగరేసుకునే పని చేసిన మంత్రి రోజా.. జగన్ కళ్ళల్లో ఆనందం..!
Minister Roja : ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా ఏపీ పర్యాటక అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తున్నారు. ఎందుకంటే.. ఏపీని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడిపించాలని సీఎం జగన్ కలలు కంటున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సీఎం జగన్ టూరిజం పాలసీ 2020-25 ప్రకారం ఏపీలో టూరిజం పరిశ్రమ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. అందుకే.. టూరిజం అభివృద్ధి కోసం మంత్రి రోజా కూడా ప్లాన్ రెడీ చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండస్ట్రియలిస్టుల ద్వారా వివిధ పర్యాటక ప్రాజెక్టులను రూపొందించాలని రోజా భావిస్తున్నారు. ఏపీ టూరిజాన్ని అభివృద్ధి చేస్తే ప్రపంచ దేశాల చూపు ఏపీపై పడుతుంది. అప్పుడు ప్రపంచ దేశాలు కూడా ఏపీలో పెట్టుబడి కోసం ముందుకు వస్తాయి. రాష్ట్ర టూరిజం పాలసీ 2020-25 ప్రకారం.. భూవినియోగంలో మార్పు కోసం పలు ప్లాన్స్ ను అమలు చేయడానికి మంత్రి రోజా ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్ర టూరిజం పాలసీ ప్రకారం.. !
Minister Roja : భూవినియోగంలో మార్పు కోసం సింగిల్ విండో క్లియరెన్స్
సింగిల్ విండో క్లియరెన్స్ తో పాటు పర్యావరణ రిజిస్ట్రేషన్ ఎనేబుల్స్, కాంట్రాక్ట్ కన్ స్ట్రక్షన్ క్లియరెన్స్, యుటిలిటీ పర్మిట్స్, టాక్స్ చెల్లింపు, సేకరణ, ప్రోత్సాహకాలు అన్నింటినీ అమలు చేయాలని మంత్రి రోజా భావిస్తున్నారు. అలాగే.. ఏపీ టూరిజం రంగంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి.. వాటిని హైలైట్ చేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి రోజా భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి.. మంత్రి రోజా ప్లాన్ వర్కవుట్ అయిందంటే ఏపీకి ఇక తిరుగే ఉండదు.