minister vellampalli srinivas fires on bjp leaders and chandra babu naidu
Chandrababu : ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి నాయకులు పూర్తిగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో నడుస్తున్నట్లుగా ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. గతంలో పవన్ కళ్యాణ్ మాత్రమే చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో మాట్లాడేవాడు. ఆయన రాసి ఇచ్చిన స్క్రిప్టుని పవన్ కళ్యాణ్ పాటించేవాడు. కానీ ఇప్పుడు బిజెపి నాయకులు కూడా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే ముందుకు సాగుతున్నారు. ఏపీ లో జరుగుతున్న బీజేపీ కార్యక్రమాలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు దర్శకత్వంలోనే సాగుతున్నాయని మంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు.చంద్రబాబు నాయుడు ఇప్పటికే చాలా అన్యాయాన్ని ఏపీ ప్రజలకు చేయడం జరిగింది.
ఇంకా బిజెపితో కలిసి ఏపీని అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎంతగా కుట్ర చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి పథంలో తీసుకు వెళుతున్నారని మంత్రి అన్నారు. ఏపీ అభివృద్ధికి సుజనా చౌదరి మరియు సీఎం రమేష్ లు సైంధవుడిలా అడ్డుపడుతూ ఉన్నారు. వారిద్దరు ఎంత ప్రయత్నించినా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధిని మాత్రం ఆపలేరు అంటూ హెచ్చరించాడు.చంద్రబాబు నాయుడు రాసిన కాగితాలను చదవడం మానేసి బీజేపీ నాయకులు సొంతంగా ఏమన్నా ప్రయత్నిస్తే బాగుంటుంది అని మంత్రి హితవు పలికారు.
minister vellampalli srinivas fires on bjp leaders and chandra babu naidu
ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, కడప స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ ఇవన్నీ తీసుకు వచ్చే సత్తా సోము వీర్రాజు కు మరియు ఆ పార్టీ సీనియర్ నాయకుడు అయిన జీవీఎల్ కు ఉందా అంటూ మంత్రి ప్రశ్నించాడు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కు దూరంగా బీజేపీ ఉండాలని.. లేదంటే వారు కూడా ఏపీకి అన్యాయం చేసిన వారు అవుతారు అంటూ మంత్రి వ్యాఖ్యలు చేశారు. తెలుగు దేశం పార్టీ బీజేపీ లు ఎంతగా కొట్టుకుంటున్నట్లుగా పైకి కనిపించినా కూడా రెండు మిత్రపక్షాలే అన్నట్లుగా మంత్రి కామెంట్స్ చేశారు.
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.