YS Jagan – Vidadala Rajini : జగన్ మోహన్ రెడ్డి కాలర్ ఎగరేసుకునే పని చేసిన విడదల రజని..!
YS Jagan – Vidadala Rajini : ఏపీని అగ్రపథంలో తీసుకెళ్తున్న సంక్షేమ పథకాల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఒకటి. చాలా పథకాలు ఏపీలో అమలులో ఉన్నాయి. జగన్ సీఎం అయ్యాక అలాంటి చాలా పథకాలను సీఎం జగన్ తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ మాత్రం వైఎస్సార్ హయాం నుంచి కంటిన్యూ అవుతోంది. దానికి మరికొన్ని యాడ్ చేసి పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందేలా సీఎం జగన్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నారు.
పేదలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై దివంగత సీఎం వైఎస్సార్ చలించిపోయి తీసుకొచ్చిందే ఆరోగ్యశ్రీ. అప్పటి వరకు దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదు. ఈ పథకాన్ని చూసే 2018 లో కేంద్రం కూడా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొచ్చిందని మంత్రి విడదల రజని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ద్వారా 3138 ప్రొసీజర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇదివరకు 940 మాత్రమే ఉండేవి. మరిన్ని సేవలు యాడ్ చేసి.. సీఎం జగన్ ఈ పథకాన్ని తీసుకొచ్చారు.
YS Jagan – Vidadala Rajini : ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో 3138 ప్రొసీజర్లు అందుబాటులోకి
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 55 లక్షల కుటుంబాలు ఆరోగ్యశ్రీ కింద లబ్దిపొందుతున్నాయి. ఈ పథకం ద్వారా పేద ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందుతోందని, దానికి కారణం అప్పట్లో వైఎస్సార్ కాగా, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అని విడదల రజనీ సీఎం జగన్ ను ఆకాశానికెత్తారు. వైఎస్సార్ హయాం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీని పట్టించుకోకపోతే.. 2019 లో సీఎం అయ్యాక జగన్.. దాన్నీ పున:ప్రారంభించి పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చారని ఆమె స్పష్టం చేశారు.