Miracle : చనిపోయాడని చెప్పి చాప చుట్టేసిన డాక్టర్లు.. తల్లి ఏడుపుతో తిరిగొచ్చిన పిల్లాడి ప్రాణాలు.. | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Miracle : చనిపోయాడని చెప్పి చాప చుట్టేసిన డాక్టర్లు.. తల్లి ఏడుపుతో తిరిగొచ్చిన పిల్లాడి ప్రాణాలు..

Miracle : ‘వెంకీ మామ’ సినిమా చూసిన ప్రతిఒక్కరికీ క్లైమ్యాక్స్ సీన్ గుర్తుండే ఉంటుంది. వెంకీ మామ చనిపోయాడంటూ డాక్టర్లు చేతులెత్తేస్తారు. కానీ ఆ వెంకీ మామ తన మేనల్లుడి మాటలతో తిరిగి బతుకుతాడు. ఆకాశంలోని గ్రహాల కన్నా, చేతిలోని గీతల కన్నా ప్రేమ గొప్పదని, అది దేన్నైనా జయిస్తుందని ఆ సినిమా ద్వారా చెబుతారు. అయితే అది రీల్ లైఫ్ కాబట్టి అలా చూపించారు తప్ప రియల్ లైఫ్ లో ఇలా జరగటం కష్టం అని […]

 Authored By kondalrao | The Telugu News | Updated on :18 June 2021,4:59 pm

Miracle : ‘వెంకీ మామ’ సినిమా చూసిన ప్రతిఒక్కరికీ క్లైమ్యాక్స్ సీన్ గుర్తుండే ఉంటుంది. వెంకీ మామ చనిపోయాడంటూ డాక్టర్లు చేతులెత్తేస్తారు. కానీ ఆ వెంకీ మామ తన మేనల్లుడి మాటలతో తిరిగి బతుకుతాడు. ఆకాశంలోని గ్రహాల కన్నా, చేతిలోని గీతల కన్నా ప్రేమ గొప్పదని, అది దేన్నైనా జయిస్తుందని ఆ సినిమా ద్వారా చెబుతారు. అయితే అది రీల్ లైఫ్ కాబట్టి అలా చూపించారు తప్ప రియల్ లైఫ్ లో ఇలా జరగటం కష్టం అని చాలా మంది పెదవి విరిచారు. కానీ అచ్చం ఇలాంటి ఒక సంఘటనే హర్యానా రాష్ట్రంలోని బహదూర్ గఢ్ అనే ప్రాంతంలో గత నెలలో చోటుచేసుకోవటం విశేషం. దాదాపు పాతిక రోజుల కిందట జరిగిన ఈ ఇన్సిడెంట్ ఆలస్యంగా వెలుగు చూసింది.

టైఫాయిడ్ రావటంతో..

హితేష్, జాన్వీ దంపతులకు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. అతనికి టైఫాయిడ్ రావటంతో కొద్ది రోజుల పాటు ఇంట్లోనే ట్రీట్మెంట్ ఇప్పించారు. అయినా అది తగ్గకపోవటంతో మెరుగైన వైద్యం కోసం ఢిల్లీలోని ఒక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ బాలుడు మే నెల 26న మరణించినట్లు వైద్యులు కన్ఫామ్ చేస్తారు. డెడ్ బాడీకి చేసినట్లే ప్యాకింగ్ కూడా చేసి ఇస్తారు. దీంతో ఆ తల్లిదండ్రులు చేసేదేం లేక, డాక్టర్లు చెప్పిన మాటలు విని, కన్నీరు మున్నీరవుతూ తమ పిల్లాణ్ని ఇంటికి తీసుకొస్తారు. బంధువులందూ అంతిమ చూపు కోసం వస్తారు.

miracle wonderfull rebirth for a boy

miracle wonderfull rebirth for a boy

ఆఖరి క్షణంలో..: Miracle

ఆ అబ్బాయికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. అవన్నీ చూసిన తల్లి పేగు తరుక్కుపోతుంది. దిక్కులు పిక్కటిట్లేలా రోదిస్తుంది. కన్నబిడ్డను చివరిసారిగా గుండెలకు హత్తుకొని విలపిస్తుంది. ఇంతలో ఏం జరిగిందో ఏమో తెలియదు. తల్లడిల్లిపోతున్న ఆ అమ్మ ఆవేదనను చూసిన యమధర్మరాజుకు సైతం గుండె కరిగిందేమో. పిల్లాడి ప్రాణాలను వెనక్కి పంపినట్లున్నాడు. కొద్దిసేపటిలో అంతిసంస్కారాలు పూర్తికావాల్సిన బాలుడి శరీరంలో అనూహ్యంగా కదలిక మొదలైంది. దీంతో అందరూ ఆశ్చర్యపోతారు. నోటి ద్వారా శ్వాస అందిస్తారు. ఛాతీపై ఒత్తడంతో గుండె కొట్టుకోవటం ప్రారంభమవుతుంది. అప్పటివరకూ శోకసంద్రంలో మునిగిపోయిన ఆ అమ్మానాన్నల పది ప్రాణాలు లేచొచ్చాయి.

Also read

kondalrao

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది