Mirai Trailer విడుద‌లైన తేజ సజ్జా మిరాయ్ ట్రైల‌ర్..దునియాలో ఏది నీది కాదు.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mirai Trailer విడుద‌లైన తేజ సజ్జా మిరాయ్ ట్రైల‌ర్..దునియాలో ఏది నీది కాదు..

 Authored By sandeep | The Telugu News | Updated on :28 August 2025,1:00 pm

హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ మైథాలజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మిరాయ్’ విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాను అత్యాధునిక టెక్నాలజీతో, విభిన్న కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, మంచు మనోజ్, శ్రియ, జగపతిబాబు, జయరామ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

#image_title

ట్రైల‌ర్ అదుర్స్..

ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మంచు మనోజ్ పాత్ర. ఎంతో కాలం తర్వాత తెరపైకి వస్తున్న ఆయన, ఈ సినిమాలో విరుద్ధ పాత్రలో అలరించబోతున్నారు. ఇటీవల విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఇప్పుడు తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాకు హైప్‌ను మరింత పెంచింది.

పౌరాణిక అంశాల‌తో కూడిన కథాంశం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మైథాలజీ, విజువల్ గ్రాండియర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా “మిరాయ్” ఉండబోతోందన్న టాక్ వినిపిస్తోంది. ఈ విజువల్ వండర్‌గా రూపొందుతున్న సినిమా సెప్టెంబర్ 12న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాతో తేజ స‌జ్జా ఖాతాలో మ‌రో హిట్ చేర‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

YouTube video

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది