Teja Sajja | ‘మిరాయ్’ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో మాంచి జోష్‌లో తేజ సజ్జా .. IMDb లో టాప్ 10లో అరుదైన రికార్డు
Teja Sajja | టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా తన లేటెస్ట్ మూవీ ‘మిరాయ్’ సూపర్ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ సై-ఫై యాక్షన్ ఫ్యాంటసీ చిత్రం భారీ కలెక్షన్లతో దూసుకుపోతూ, ఇప్పటికే రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

#image_title
రేర్ రికార్డ్..
తాజాగా తేజ సజ్జా IMDb’s Most Popular Indian Celebrities లిస్టులో ఇండియా వైడ్‌గా 9వ స్థానాన్ని దక్కించుకున్నాడు. గమనించదగ్గ విషయం ఏంటంటే, గత వారం ఈ ర్యాంకింగ్స్‌లో తేజ 160వ స్థానంలో ఉన్నాడు. కానీ ‘మిరాయ్’ విడుదలతో పాటు సినిమాకు వచ్చిన పాజిటివ్ బజ్ కారణంగా, తేజ ర్యాంక్ ఒకేసారి 150 స్థాయిల పైకి ఎగబాకింది.
1వ స్థానంలో: బాలీవుడ్ యంగ్ హీరో అహన్ పాండే – ఆయన నటించిన ‘సయారా’ సెన్సేషన్ క్రియేట్ చేయడంతో టాప్ ప్లేస్ దక్కింది. 3వ స్థానంలో: మరో ‘సయారా’ నటుడు అనీత్ పడ్డ నిలిచాడు.6వ స్థానంలో: ‘జోలీ ఎల్‌ఎల్‌బీ 3’ ప్రమోషన్లలో బిజీగా ఉన్న అక్షయ్ కుమార్ నిలిచాడు.‘మిరాయ్’ విజయం తరువాత తేజ సజ్జా ‘జాంబీ రెడ్డి 2’ కోసం సిద్ధమవుతున్నాడు. 2021లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘జాంబీ రెడ్డి’ సెన్సేషనల్ హిట్ అయిన విషయం తెలిసిందే. దానికి సీక్వెల్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే బజ్ స్టార్ట్ అయింది.