Mirai | మిరాయ్ మానియా.. హ‌నుమాన్ రికార్డులు కూడా తిరగాసిందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mirai | మిరాయ్ మానియా.. హ‌నుమాన్ రికార్డులు కూడా తిరగాసిందిగా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :13 September 2025,2:00 pm

Mirai | సెప్టెంబర్ 12న విడుదలైన మిరాయ్ సినిమాకు ఆడియన్స్ నుంచి యునానిమస్ బ్లాక్ బస్టర్ రిపోర్ట్ వచ్చింది. సినిమా కథ, ప్రెజెంట్ చేసిన విధానం, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్.. ఇలా ప్రతీ విషయంలో కూడా ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా మిరాయ్(Mirai) గురించే చర్చ నడుస్తోంది.

#image_title

ఇది అస‌లైన విజ‌యం..

మిరాయ్ సినిమా కోసం మేకర్స్ కేవలం రూ.60 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. సెప్టెంబర్‌ 12న విడుదలైన ఈ సినిమా తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.27.20 కోట్లకుపైగా కలెక్షన్స్‌ సాధించింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది హనుమాన్‌ సినిమాకు వచ్చిన ఫస్ట్ డే కలెక్షన్స్ కంటే చాలా ఎక్కువ. తేజ సజ్జ హీరోగా వచ్చిన హనుమాన్‌ మూవీ మొదటిరోజు దాదాపు రూ. 10 కోట్ల నెట్‌ వసూళ్లు రాబట్టింది.

ఇప్పుడు ఈ రికార్డును మిరాయ్‌ మూవీ బద్ధలు కోటేయ‌డంతో తేజ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. అది కూడా ఎలాంటి టికెట్ హైక్స్ లేకుండా ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం అంటే మాములు విషయం కాదు. ఇక నార్త్‌ అమెరికా విషయానికి వస్తే మొదటిరోజు 7 లక్షల డాలర్లు అంటే సుమారు రూ.6 కోట్లకు పైనే వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ అంటూ పోస్టర్ ను విడుదల చేశాడు. ఈ వీకెండ్ లో సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది