MLA Kethireddy : భోజనంలో పురుగులు వస్తున్నాయని ఫిర్యాదు చేసిన స్టూడెంట్.. స్కూల్ కి వెళ్లిన ఎమ్మెల్యే కేతిరెడ్డి..!!
MLA Kethireddy : ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ కార్యక్రమం ఆంధ్ర రాజకీయాలలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డికి రాష్ట్రవ్యాప్తంగా విపరీతమైన ఇమేజ్ ఏర్పడింది. తనని గెలిపించిన ప్రజల వద్దకు ప్రతిరోజు వెళుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ అక్కడికక్కడే పరిష్కారాలు చూపుతూ ఒక సమయంలో నిర్లక్ష్యం వ్యవహరించిన అధికారులను నిలదీస్తూ ఎమ్మెల్యే కేతిరెడ్డి వ్యవహరిస్తూ ఉంటారు. ఇదే సమయంలో రోడ్డుపై చదువుకోవలసిన పిల్లలు కనపడితే వారి యోగక్షేమాలు తెలుసుకొని..
ఒకవేళ చదువు ఆపేస్తే వెంటనే అధికారులను అప్రమత్తం చేసి సదరు పిల్లవాడిని స్కూల్ కి వెళ్లేలా చర్యలు తీసుకుంటారు. ఇదిలా ఉంటే ఇటీవల గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఓ విద్యార్థిని తనకి మధ్యాహ్నం పెట్టే భోజనంలో పురుగులు వస్తున్నాయని ఎమ్మెల్యే కేతిరెడ్డి దృష్టికి తీసుకొచ్చింది. దీంతో వెంటనే కేతిరెడ్డి సదరు పాఠశాలకు వెళ్లి.. అక్కడ విద్యార్థులను ప్రశ్నించడం జరిగింది. మధ్యాహ్నం భోజనం లో పురుగులు వస్తున్నాయని.. నాకు ఒక స్టూడెంట్ ఫిర్యాదు చేశారు.
నిజంగా మీరు తినే భోజనంలో పురుగులు వస్తున్నాయా అని అడగగా లేదు అని పిల్లలు సమాధానం ఇచ్చారు. ఇదే సమయంలో పాఠశాలలలో టాయిలెట్స్ గురించి ఇంకా ఎంతమంది మాస్టర్ పనిచేస్తున్నారు అనే విషయాలు పిల్లలను అడిగి ఎమ్మెల్యే కేతిరెడ్డి తెలుసుకోవడం జరిగింది. బాత్రూం క్లీన్ గా ఉంటున్నాయా లేదా కూడా స్టూడెంట్స్ ని ఎమ్మెల్యే ప్రశ్నించారు. అన్నిటికీ స్కూల్లో చదివే విద్యార్థులు బాగున్నాయని సమాధానం ఇవ్వడం జరిగింది.