AP Anganwadi : అంగన్వాడీలతో చర్చలు జరిపిన జగన్ ప్రభుత్వం…జీతాల పెంపు ఎప్పుడంటే…
AP Anganwadi : ఆంధ్ర రాష్ట్రంలో గత కొంతకాలంగా అంగన్వాడీలు జీతాల పెంపు కోసం ధర్నాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అంగన్వాడీలతో జగన్ ప్రభుత్వం చర్చలు జరిపారు. అయితే తాజాగా అంగన్వాడీలతో ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి అని చెప్పాలి. దీంతో అంగన్వాడీలు విధుల్లోకి త్వరలోనే రానున్నారు. అయితే అంగన్వాడీలు డిమాండ్ చేసిన 11 డిమాండ్లలో ఇప్పటికే 10 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలియజేశారు. అదేవిధంగా అంగన్వాడీలకి జులై […]
AP Anganwadi : ఆంధ్ర రాష్ట్రంలో గత కొంతకాలంగా అంగన్వాడీలు జీతాల పెంపు కోసం ధర్నాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అంగన్వాడీలతో జగన్ ప్రభుత్వం చర్చలు జరిపారు. అయితే తాజాగా అంగన్వాడీలతో ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి అని చెప్పాలి. దీంతో అంగన్వాడీలు విధుల్లోకి త్వరలోనే రానున్నారు. అయితే అంగన్వాడీలు డిమాండ్ చేసిన 11 డిమాండ్లలో ఇప్పటికే 10 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలియజేశారు. అదేవిధంగా అంగన్వాడీలకి జులై నెలలో జీతాలు పెంచుతామని స్పష్టం చేశారు. అదేవిధంగా అంగన్వాడీల ఉద్యోగ విరమణ సమయంలో ఇచ్చే ప్రయోజనాలను దాదాపు 50 వేల నుండి లక్ష ఇరవై వేల రూపాయలకు పెంచనున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా అంగన్వాడి హెల్పర్లకు కూడా 60 వేలకు పెంచే విధంగా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా సమ్మె కాలానికి కూడా జీతాలను కలిపి ఇస్తామని , సమ్మె సమయంలో పెట్టిన కేసులను కూడా తీసేస్తామని తెలియజేశారు.
అదేవిధంగా జీతాల పెంపుపై చర్చల్లో తీసుకున్న నిర్ణయాన్ని మినిట్స్ లో కచ్చితంగా నమోదు చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అలాగే గ్రాటివిటీకి సంబంధించి కేంద్ర నిబంధనలను పాటిస్తామని తెలియజేశారు. అలాగే అంగన్వాడి ఉద్యోగ విరమణ వయస్సు 60 నుండి 62 సంవత్సరాలకు పెంచనున్నట్లు వారు తెలియజేశారు. అలాగే అంగన్వాడి రోజువారి కార్యక్రమాలలో సమస్యలను పరిష్కరించి వారికి సహకరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి సత్యనారాయణ. అదేవిధంగా తమ ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి కాదని ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఆలోచన మా ప్రభుత్వానికి లేదని ప్రతిపక్ష పార్టీలు కావాలనే మాపై బురద చల్లుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలియజేశారు. అయితే ప్రభుత్వంతో జరిగిన చర్చలు అనంతరం ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి సుబ్బారావమ్మ మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఆమె మాట్లాడుతూ చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని …
ఇక ఇప్పుడు అంగన్వాడీలు సమ్మెను విరమిస్తున్నామని విధులకు హాజరవుతామని తెలియజేశారు. అదేవిధంగా జీతాలు పెంపుపై నిర్దిష్ట నిర్ణయంగా జులై నెలలో జీతాలను పెంచుతామన్నారని తెలియజేశారు. ఇక జీతాలు పెంపు ఎంత అనేది కూడా రాతపూర్వకంగా ఇస్తారు అని ఆమె చెప్పారు. అదేవిధంగా రిటర్మెంట్ బెనిఫిట్ ను పెంచుతామన్నరని వారి డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించిందని ఆమె తెలియజేశారు. అదేవిధంగా అంగన్వాడీలకు వైఎస్ఆర్ బీమా మరియు అంగన్వాడీ రెస్టారెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా అంగన్వాడీలకు కూడా సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని , ఇక సమ్మె కాలానికి కూడా జీతం కలిపి ఇవ్వడంతో పాటు వారిపై నమోదు చేసిన కేసులను తీసేందుకు ప్రభుత్వం అంగీకరించిందని అంగన్వాడి ప్రధాన కార్యదర్శి సుబ్బారావు అమ్మ తెలియజేశారు.