MLA Kethireddy : గబ్బు నాయాల పొద్దున్నే మందు తాగావా.. ఎమ్మెల్యే కేతిరెడ్డి సీరియస్ వార్నింగ్ వీడియో వైరల్..!!
MLA Kethireddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రజా పాలన పరంగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. తన నియోజకవర్గంలో “గుడ్ మార్నింగ్ ధర్మవరం” పేరిట ఆయన నిర్వహించిన కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా బాగా పాపులర్ అయింది. ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ ప్రజలకు సంబంధించి కేతిరెడ్డి వ్యవహరించే తీరు.. చాలామంది ప్రజానీకాన్ని ఆకట్టుకుంటూ ఉంది. ప్రతి ఒక్కరితో ప్రేమగా పలకరించటం
తో పాటు స్వయంగా వాళ్ల దగ్గరకు వెళ్లి ఏదైనా సమస్య ఉందా అని అడిగి మరి తెలుసుకొని… అక్కడికక్కడే పరిష్కారాలు చూపిస్తూ ఉంటారు. ఈ రకంగానే తాజాగా నిర్వహించిన గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో… ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓ ప్రాంతంలో పర్యటించారు. అయితే ఆ ప్రాంతంలో కరెంటు పోల్ వైర్లు కిందకు ఉండటంతో పాటు దారికి అడ్డంగా ఉండటంతో… ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే దృష్టికి దాన్ని తీసుకొచ్చారు.
అయితే సదరు వ్యక్తి ఫుల్ గా తాగి ఉండటంతో ఎమ్మెల్యే పొద్దుపొద్దున్నే తాగేసవ అంటూ అతనిపై సెటైర్లు వేశారు. తాగి తాగి మొహం చూడు ఎలా పీక్కుపోయిందో… మందు ఆ తాగుడు తగ్గించు అని సున్నితంగా అతడికి వార్నింగ్ ఇచ్చారు. అదే సమయంలో కరెంట్ అధికారులను అలర్ట్ చేసి… ఆ కరెంటు పోల్ వైర్లను.. సరిచేయాలని కోరడం జరిగింది. ఇంకా అదే ప్రాంతంలో పలువురు పెన్షన్ సమస్యలను ఎమ్మెల్యే తీర్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.