Business Ideas : 5 వేలు పెట్టుబడి పెడితే చాలు.. నెలకు 2 లక్షల వరకు సంపాదించుకునే బెస్ట్ బిజినెస్? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Business Ideas : 5 వేలు పెట్టుబడి పెడితే చాలు.. నెలకు 2 లక్షల వరకు సంపాదించుకునే బెస్ట్ బిజినెస్?

Business Ideas : ప్రస్తుత జనరేషన్ లో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. ఉద్యోగాలు అందరికీ దొరకడం లేదు. ఉద్యోగం వచ్చినా తక్కువ జీతం, ఎక్కువ పని.. దీని వల్ల యువత ఎక్కువ ఒత్తిడికి గురవుతోంది. అందుకే.. ఉద్యోగం అంటూ దాని వెనుక పడే బదులు.. ఏదో ఒక బిజినెస్ చేసుకొని స్వయం ఉపాధి పొందడం చాలా బెటర్. చిన్న చిన్న బిజినెస్ లు స్టార్ట్ చేసి తర్వాత పెద్ద బిజినెస్ గా మార్చుకొని కోట్లు సంపాదించిన […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :8 March 2021,7:50 pm

Business Ideas : ప్రస్తుత జనరేషన్ లో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. ఉద్యోగాలు అందరికీ దొరకడం లేదు. ఉద్యోగం వచ్చినా తక్కువ జీతం, ఎక్కువ పని.. దీని వల్ల యువత ఎక్కువ ఒత్తిడికి గురవుతోంది. అందుకే.. ఉద్యోగం అంటూ దాని వెనుక పడే బదులు.. ఏదో ఒక బిజినెస్ చేసుకొని స్వయం ఉపాధి పొందడం చాలా బెటర్. చిన్న చిన్న బిజినెస్ లు స్టార్ట్ చేసి తర్వాత పెద్ద బిజినెస్ గా మార్చుకొని కోట్లు సంపాదించిన వాళ్లు కోకొల్లలు.

mobile charger holder business best in low budget

mobile charger holder business best in low budget

బిజినెస్ ఏదైనా కూడా పర్ ఫెక్ట్ ప్లాన్ తో ముందుకెళ్తే.. ఆ బిజినెస్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కాకపోతే తొలి అడుగు అనేది చాలా ముఖ్యం. ఏ బిజినెస్ అయినా.. సరైన ప్రణాళికలు రచించుకొని ముందడుగు వేయాలి.

తక్కువ బడ్జెట్ తో ఏదో ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్లకు మార్కెట్ లో చేయడానికి ఎన్నో బిజినెస్ లు ఉన్నాయి. కేవలం 5 వేల రూపాయలు పెట్టినా చాలు. కొంచెం కష్టపడితే నెలకు 2 లక్షల వరకు సంపాదించుకునే బ్రహ్మాండమైన అవకాశం ఉంది.

Business Ideas : 5 వేల రూపాయలతో మొబైల్ చార్జర్ హోల్డర్ బిజినెస్ స్టార్ట్ చేయండి

ప్రస్తుత జనరేషన్ లో చాలామంది మొబైల్ ఉపయోగిస్తున్నారు. అందరికీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి.. ఆ మొబైల్ కు అవసరమైన వాటిని మనం మార్కెట్ చేయడమే ఈ బిజినెస్ ఉద్దేశం.

mobile charger holder business best in low budget

mobile charger holder business best in low budget

చాలామందికి ఫోన్ చార్జింగ్ చేయడం కోసం మొబైల్ చార్జర్ హోల్డర్ ఉండదు. చార్జింగ్ చేయాలంటే సాకెట్ పైన ఉండి.. చార్జర్ వైరు తక్కువగా ఉండటం వల్ల.. చాలామంది మొబైల్ ను సరిగ్గా చార్జింగ్ చేయలేక.. దాన్ని కిందికి వేలాడదీస్తారు. దాని వల్ల మొబైల్ తో పాటు చార్జర్  కూడా చెడిపోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవాళ్లు ఈ సమస్యను ఎదుర్కొంటారు. బస్సుల్లో, బస్టాండుల్లో, రైల్వే స్టేషన్లలో, ఎయిర్ పోర్టుల్లో మొబైల్ చార్జింగ్ పెట్టుకోవడం కోసం సాకెట్స్ పైన ఉంటాయి.. కానీ.. మొబైల్ ను పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు. అటువంటి వాళ్ల కోసం వచ్చిందే మొబైల్ చార్జర్ హోల్డర్. ప్రస్తుతం మార్కెట్ లో ఇదే ట్రెండింగ్ ప్రాడక్ట్.

mobile charger holder business best in low budget

mobile charger holder business best in low budget

ఈ బిజినెస్ ప్రస్తుతం బాగానే నడుస్తోంది. అమెజాన్, ప్లిఫ్ కార్ట్ లాంటి ఈకామర్స్ వెబ్ సైట్లలో ఒక మొబైల్ చార్జర్ హోల్డర్ ధర 150 నుంచి 200 వరకు ఉంటుంది. కానీ.. అదే మొబైల్ చార్జర్ హోల్డర్ ధర ఇండియా మార్ట్ వెబ్ సైట్ లో 16 రూపాయలు ఉంటుంది. ఒకేసారి బల్క్ లో మొబైల్ చార్జర్ హోల్డర్లను బుక్ చేసుకొని.. వాటితో పాటు ప్యాకింగ్ కవర్స్ ను కూడా ఆర్డర్ చేసుకుంటే చాలు. ముందు 5000 రూపాయలతో ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు.

ఒకసారి ఆర్డర్ డెలివరీ అయ్యాక.. వాటిని ప్యాక్ చేసుకొని.. ఫేస్ బుక్, వాట్సప్ లాంటి సోషల్ మీడియా వెబ్ సైట్లలో మన ప్రాడక్ట్ గురించి ప్రమోట్ చేసుకోవాలి.

ఒక మొబైల్ చార్జర్ హోల్డర్ ధర.. ప్యాక్ చేసి కోరియర్ చేసినందుకు.. సుమారు 40 రూపాయలు అయినా.. దాన్ని 150 నుంచి 200 రూపాయల వరకు అమ్ముకోవచ్చు. మరీ తక్కువలో తక్కువ 100 రూపాయలకు అయినా అమ్ముకున్నా.. 60 రూపాయల వరకు లాభం వస్తుంది. అంటే.. రోజుకు ఓ 100 అమ్మినా కూడా.. 6 రూపాయల లాభం వస్తుంది. అంటే నెలకు సుమారు 1,80,000 వరకు సంపాదించవచ్చు.

mobile charger holder business best in low budget

mobile charger holder business best in low budget

కస్టమర్లు అడ్రస్ పంపిస్తే.. వాళ్లకు ఆన్ లైన్ లో పేమెంట్ చేయాలని చెప్పి.. కోరియర్ ద్వారా ప్రాడక్ట్ పంపిస్తే చాలు. ఒకవేళ క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తాం అని కస్టమర్ చెప్పినా.. పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. కొన్ని కోరియర్ కంపెనీలు ప్రాడక్ట్ ను డెలివరీ చేసి.. కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకొని తిరిగి కంపెనీకి చెల్లిస్తాయి.

ఒకవేళ ఆన్ లైన్ లో ప్రాడక్ట్స్ ను అమ్మాలనుకుంటే.. అమెజాన్, ప్లిఫ్ కార్టుల్లో సెల్లర్ గా మారి.. ఆన్ లైన్ లోనూ ఈ ప్రాడక్ట్ ను అమ్ముకోవచ్చు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది