Small Business Ideas : రూ.1000 పెట్టుబడితో నెలకు రూ.50 వేలు సంపాదించే బెస్ట్ బిజినెస్ ఇది
Small Business Ideas : చాలామంది ఉద్యోగాలు కాదని ఏదైనా బిజినెస్ చేయాలని అనుకుంటారు. కానీ.. ఏ బిజినెస్ చేయాలి అనేదానిపై వాళ్లకు క్లారిటీ ఉండదు. మనకు ఏ రంగం ఇష్టమో ఆ రంగంలో అడుగు పెడితేనే రాణించే అవకాశం ఉంటుంది. మహిళలు అయినా.. యువకులు ఎవరైనా సరే ఏదైనా బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా ఆ రంగం మీద కాస్తో కూస్తో అనుభవం ఉండాలి. ఆ రంగం మీద పట్టు, ఇష్టం ఉండాలి. అప్పుడే ఆ రంగంలో రాణిస్తారు. తక్కువ పెట్టుబడితో నెలకు ఎక్కువ లాభాలు సంపాదించే రంగాల్లో ఉప్పు బిజినెస్ ఒకటి.
ఉప్పు బిజినెస్ చేస్తూ చాలామంది ఎక్కువ లాభాలు పొందుతున్నారు. ఒక ఉప్పు టన్ను సుమారు వెయ్యి రూపాయలు ఉంటుంది. సముద్ర తీరాన ఉప్పును కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అక్కడ ఉప్పు కొనుగోలు చేసి ప్యాకెట్లుగా చేసి లాభాలు పొందొచ్చు. మార్కెట్ లో ఒక కిలో ఉప్పు రూ.10 నుంచి రూ.20 వరకు ధర పలుకుతోంది. కానీ.. పరిశ్రమలో ఒక కిలో ఉప్పు 90 పైసలు మాత్రమే పడుతుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో ఉప్పును కొనుగోలు చేసి మార్కెట్ లో మాల్స్ కి, కిరాణ షాపులకు సప్లయి చేసి ఎక్కువ లాభాలు పొందొచ్చు.
Small Business Ideas : 90 పైసలు కిలోకి పడుతుంది
సముద్ర తీరాన కొని పార్శిల్ చేసుకొని సప్లయి చేసుకుంటే అందులో వచ్చే లాభాలు మామూలుగా ఉండవు. కేవలం వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టి నెలకు రూ.50 వేలకు తగ్గకుండా పొందొచ్చు. చిన్న మొత్తంలోనే ఎక్కువ లాభాలు పొందే బిజినెస్ ఇది. మనకు ఇష్టమైన రంగం ఎంచుకొని అందులో ఇష్టమైన పని చేసుకుంటూ పోతే లాభాలు వాటంతట అవే వస్తాయి. రెగ్యులర్ గా బ్రాండింగ్, క్వాలిటీ చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. వీటి మీద దృష్టి పెట్టి రెగ్యులర్ గా చేస్తూ ఉంటే లాభాలు పొందడం చాలా ఈజీ.