Self Employment : స్వ‌యం ఉపాధికి సూప‌ర్ మార్గం.. ల‌క్ష‌ల్లో ఆదాయం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Self Employment : స్వ‌యం ఉపాధికి సూప‌ర్ మార్గం.. ల‌క్ష‌ల్లో ఆదాయం..!

Self Employment : యువ‌తీ, యువ‌కులు త‌మ చ‌దువులు పూర్తి కాగానే ఉద్యోగ వేట‌లో మునిగిపోతారు. ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవ‌కాశాలు ద‌క్కించుకునేందుకు త‌మ ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేస్తుంటారు. అయితే ఏటా ల‌క్ష‌ల్లో ప‌ట్ట‌భ‌ద్రులు బ‌య‌టి ప్ర‌పంచంలోకి అడుగుపెడుతున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగా ఉద్యోగ అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో చాలామంది చిరుద్యోగులు, నిరుద్యోగులుగా మిగులుతున్నారు. అయితే కొంత‌మంది మాత్రం వినూత్నంగా ఆలోచిస్తూ స్వ‌యం ఉపాధి పొందుతూ మ‌రికొంద‌రికి ఉపాధి కల్పిస్తున్నారు. అటువంటి వారిలో ఒక‌డే ఏపీలోని శ్రీ స‌త్య‌సాయి […]

 Authored By ramu | The Telugu News | Updated on :8 September 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Self Employment : స్వ‌యం ఉపాధికి సూప‌ర్ మార్గం.. ల‌క్ష‌ల్లో ఆదాయం..!

Self Employment : యువ‌తీ, యువ‌కులు త‌మ చ‌దువులు పూర్తి కాగానే ఉద్యోగ వేట‌లో మునిగిపోతారు. ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవ‌కాశాలు ద‌క్కించుకునేందుకు త‌మ ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేస్తుంటారు. అయితే ఏటా ల‌క్ష‌ల్లో ప‌ట్ట‌భ‌ద్రులు బ‌య‌టి ప్ర‌పంచంలోకి అడుగుపెడుతున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగా ఉద్యోగ అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో చాలామంది చిరుద్యోగులు, నిరుద్యోగులుగా మిగులుతున్నారు. అయితే కొంత‌మంది మాత్రం వినూత్నంగా ఆలోచిస్తూ స్వ‌యం ఉపాధి పొందుతూ మ‌రికొంద‌రికి ఉపాధి కల్పిస్తున్నారు. అటువంటి వారిలో ఒక‌డే ఏపీలోని శ్రీ స‌త్య‌సాయి జిల్లా క‌దిరికి చెందిన చ‌ర‌ణ్ అనే యువ‌కుడు.గత 11 సంవత్సరాల నుండి ఈ యువకుడు మొక్కల పెంప‌కం వ్యాపారంలో రాణిస్తున్నాడు. పూల మెుక్కలు, పండ్ల మొక్కల పెంపకంలో లాభాలు గడిస్తున్నాడు. అంతేకాకుండా అరుదైన మొక్కలను పెంచి వాటిని విక్రయిస్తున్నాడు. ఏడాదికి రూ.10 లక్షలు ఆదాయం పొందుతున్నాడు.

పూలు, పండ్ల తోటలు పెంచే రైతులు నారు పెంప‌కంలో నర్సరీలపైన ఆధారపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే నర్సరీలు కూడా నూతన సాంకేతిక విధానం అందుకుంటూ మొక్కలను అభివృద్ధి చేసి రైతులకు అందిస్తున్నాయి. ఇలాంటి నర్సరీలు చాలామందికి ఉపాధి మార్గాలుగా మారాయి. కదిరికి చెందిన చరణ్ 70 సెంట్లలో అవుట్ డోర్, ఇండోర్ మొక్కలు సాగు చేస్తూ లాభాలను గడిస్తున్నాడు. తోటలు ఏపుగా పెరిగి మంచి దిగుబడులు రావాలంటే అది నారు మొక్క‌ల‌పైనే ఆధార‌ప‌డి ఉంటుంది. నాణ్య‌మైన మొక్క‌ల ఎంపిక లేక‌పోతే తోట యజమానులకు దిగుబడి ఆదాయంలో అత్యంత నష్టం వాటిల్లితుంది. దాంతో ఇవి దృష్టిలో ఉంచుకున్న రైతులు పండ్ల తోటలను సాగు చేయాలనుకునేవారు మంచి నారుపై నర్సరీలపై ఆధారపడుతున్నారు.

Self Employment స్వ‌యం ఉపాధికి సూప‌ర్ మార్గం ల‌క్ష‌ల్లో ఆదాయం

Self Employment : స్వ‌యం ఉపాధికి సూప‌ర్ మార్గం.. ల‌క్ష‌ల్లో ఆదాయం..!

అందుకు తగ్గట్టుగానే నర్సరీలు కూడా రైతుకు కావాల్సిన మొక్కలను పెంచి అందిస్తున్నాయి. చ‌ర‌ణ్ న‌ర్స‌రీలో 25 నుంచి 30 రకాల మొక్కలు ల‌భిస్తాయ‌. పండా, ప్రెస్టేజ్, ఫైకస్, క్రొనొకర్పస్, జాస్మిన్, నూరువరాలు, సన్నజాజి, సంపంగి, నందివర్ధన, విరాజాజీ, రోజా, క్రిపర్స్, రెడీలిఫ్టిక్, అగ్లోనియం, హ్యాంగింగపాట్స్, లిల్లి, అమరలిల్లి, ఇన్సులిన్, మినిజమా, మినీ దానిమ్మ, హైబిస్కస్, థాయిలాండ్ స్పెషల్ మొక్కలు, గులాబీ మొక్కల ల‌భిస్తాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది