Business Ideas : ప్రస్తుత జనరేషన్ లో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. ఉద్యోగాలు అందరికీ దొరకడం లేదు. ఉద్యోగం వచ్చినా తక్కువ జీతం, ఎక్కువ పని.. దీని వల్ల యువత ఎక్కువ ఒత్తిడికి గురవుతోంది. అందుకే.. ఉద్యోగం అంటూ దాని వెనుక పడే బదులు.. ఏదో ఒక బిజినెస్ చేసుకొని స్వయం ఉపాధి పొందడం చాలా బెటర్. చిన్న చిన్న బిజినెస్ లు స్టార్ట్ చేసి తర్వాత పెద్ద బిజినెస్ గా మార్చుకొని కోట్లు సంపాదించిన వాళ్లు కోకొల్లలు.
బిజినెస్ ఏదైనా కూడా పర్ ఫెక్ట్ ప్లాన్ తో ముందుకెళ్తే.. ఆ బిజినెస్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కాకపోతే తొలి అడుగు అనేది చాలా ముఖ్యం. ఏ బిజినెస్ అయినా.. సరైన ప్రణాళికలు రచించుకొని ముందడుగు వేయాలి.
తక్కువ బడ్జెట్ తో ఏదో ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్లకు మార్కెట్ లో చేయడానికి ఎన్నో బిజినెస్ లు ఉన్నాయి. కేవలం 5 వేల రూపాయలు పెట్టినా చాలు. కొంచెం కష్టపడితే నెలకు 2 లక్షల వరకు సంపాదించుకునే బ్రహ్మాండమైన అవకాశం ఉంది.
ప్రస్తుత జనరేషన్ లో చాలామంది మొబైల్ ఉపయోగిస్తున్నారు. అందరికీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి.. ఆ మొబైల్ కు అవసరమైన వాటిని మనం మార్కెట్ చేయడమే ఈ బిజినెస్ ఉద్దేశం.
చాలామందికి ఫోన్ చార్జింగ్ చేయడం కోసం మొబైల్ చార్జర్ హోల్డర్ ఉండదు. చార్జింగ్ చేయాలంటే సాకెట్ పైన ఉండి.. చార్జర్ వైరు తక్కువగా ఉండటం వల్ల.. చాలామంది మొబైల్ ను సరిగ్గా చార్జింగ్ చేయలేక.. దాన్ని కిందికి వేలాడదీస్తారు. దాని వల్ల మొబైల్ తో పాటు చార్జర్ కూడా చెడిపోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవాళ్లు ఈ సమస్యను ఎదుర్కొంటారు. బస్సుల్లో, బస్టాండుల్లో, రైల్వే స్టేషన్లలో, ఎయిర్ పోర్టుల్లో మొబైల్ చార్జింగ్ పెట్టుకోవడం కోసం సాకెట్స్ పైన ఉంటాయి.. కానీ.. మొబైల్ ను పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు. అటువంటి వాళ్ల కోసం వచ్చిందే మొబైల్ చార్జర్ హోల్డర్. ప్రస్తుతం మార్కెట్ లో ఇదే ట్రెండింగ్ ప్రాడక్ట్.
ఈ బిజినెస్ ప్రస్తుతం బాగానే నడుస్తోంది. అమెజాన్, ప్లిఫ్ కార్ట్ లాంటి ఈకామర్స్ వెబ్ సైట్లలో ఒక మొబైల్ చార్జర్ హోల్డర్ ధర 150 నుంచి 200 వరకు ఉంటుంది. కానీ.. అదే మొబైల్ చార్జర్ హోల్డర్ ధర ఇండియా మార్ట్ వెబ్ సైట్ లో 16 రూపాయలు ఉంటుంది. ఒకేసారి బల్క్ లో మొబైల్ చార్జర్ హోల్డర్లను బుక్ చేసుకొని.. వాటితో పాటు ప్యాకింగ్ కవర్స్ ను కూడా ఆర్డర్ చేసుకుంటే చాలు. ముందు 5000 రూపాయలతో ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు.
ఒకసారి ఆర్డర్ డెలివరీ అయ్యాక.. వాటిని ప్యాక్ చేసుకొని.. ఫేస్ బుక్, వాట్సప్ లాంటి సోషల్ మీడియా వెబ్ సైట్లలో మన ప్రాడక్ట్ గురించి ప్రమోట్ చేసుకోవాలి.
ఒక మొబైల్ చార్జర్ హోల్డర్ ధర.. ప్యాక్ చేసి కోరియర్ చేసినందుకు.. సుమారు 40 రూపాయలు అయినా.. దాన్ని 150 నుంచి 200 రూపాయల వరకు అమ్ముకోవచ్చు. మరీ తక్కువలో తక్కువ 100 రూపాయలకు అయినా అమ్ముకున్నా.. 60 రూపాయల వరకు లాభం వస్తుంది. అంటే.. రోజుకు ఓ 100 అమ్మినా కూడా.. 6 రూపాయల లాభం వస్తుంది. అంటే నెలకు సుమారు 1,80,000 వరకు సంపాదించవచ్చు.
కస్టమర్లు అడ్రస్ పంపిస్తే.. వాళ్లకు ఆన్ లైన్ లో పేమెంట్ చేయాలని చెప్పి.. కోరియర్ ద్వారా ప్రాడక్ట్ పంపిస్తే చాలు. ఒకవేళ క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తాం అని కస్టమర్ చెప్పినా.. పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. కొన్ని కోరియర్ కంపెనీలు ప్రాడక్ట్ ను డెలివరీ చేసి.. కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకొని తిరిగి కంపెనీకి చెల్లిస్తాయి.
ఒకవేళ ఆన్ లైన్ లో ప్రాడక్ట్స్ ను అమ్మాలనుకుంటే.. అమెజాన్, ప్లిఫ్ కార్టుల్లో సెల్లర్ గా మారి.. ఆన్ లైన్ లోనూ ఈ ప్రాడక్ట్ ను అమ్ముకోవచ్చు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.