
Modi govt sanctioned money for house construction to people
Modi: సొంతిళ్లు కట్టుకోవాలనుకుని ప్రతీ ఒక్కరు అనుకుంటారు. అందుకుగాను చాలా కాలం పాటు శ్రమిస్తుంటారు. అయితే, ఇళ్లు కట్టుకోవాలనుకోవడం ప్రస్తుతమున్న ధరలతో చాలా కష్టతరమైన కార్యంగా ఉండిపోతున్నది. ఈ క్రమంలోనే ఎప్పటి నుంచో చాలా మంది ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు. కానీ, ఆచరణలో ముందుకు అడుగులు వేయడం లేదు. ఈ నేపథ్యంలో వారికి కేంద్ర ప్రభుత్వం తాజాగా శుభవార్త చెప్పింది.కేంద్రప్రభుత్వం తాజాగా లక్ష ఇళ్లకు పైగా నిర్మించనున్నట్లు తెలిపింది. ఇందుకు ఆమోదం కూడా తెలిపింది. ఆ స్కీమ్ వివరాల్లోకెళితే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన ఆ స్కీమ్ పేరు ‘ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్’.
ఈ స్కీమ్ కింద ఇళ్లను ప్రభుత్వం నిర్మించి ఇవ్వనుంది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహరాష్ట్ర, పుదుచ్చెర్రీ, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో ఈ ఇళ్లను నిర్మించనున్నట్లు సమాచారం. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా ఈ మేరకు తెలిపారు. సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ 57వ సమావేశంలో ఈ మేరకు డెసిషన్ తీసుకున్నారు. ఇప్పటి దాకా ఈ మిషన్ కింద రూ.1.14 కోట్ల ఇళ్లకు మంజూరు లభించగా, 53 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి అయింది. ఇంకా చాలా ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం కొనసా..గుతోంది. ఇకపోతే ఈ మిషన్ కోసం రూ.7.52 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం వెచ్చించనున్నది. వీటిలో కేంద్రం వాటా రూ.1.85 లక్షల కోట్లు కాగా, ఇప్పటికే రూ.1.14 లక్షల కోట్లు కేంద్రం మంజూరు చేసింది.
Modi govt sanctioned money for house construction to people
ఇక ఇల్లు కట్టుకోవాలనుకునే వారు ఈ స్కీమ్ కోసం ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు. నేరుగా పీఎం ఆవాస్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ సిటిజన్ అసెస్‌మెంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ, ఆఫర్డబుల్ హౌసింగ్, ఇండివీజువల్ హౌస్ కన్‌స్ట్రక్షన్, స్లామ్ రీడెవలప్‌మెంట్ అనేవి ఉండగా, అందులో మీ ఆప్షన్ సెలక్ట్ చేసుకుని, ఆ తర్వాత ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆన్ లైన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. అంతే మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.