Modi : ఇళ్లు కట్టుకోవాలనుకునే వారికి శుభవార్త.. లక్ష ఇళ్ల మంజూరు.. అప్లై చేసుకోండిలా.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Modi : ఇళ్లు కట్టుకోవాలనుకునే వారికి శుభవార్త.. లక్ష ఇళ్ల మంజూరు.. అప్లై చేసుకోండిలా..

Modi: సొంతిళ్లు కట్టుకోవాలనుకుని ప్రతీ ఒక్కరు అనుకుంటారు. అందుకుగాను చాలా కాలం పాటు శ్రమిస్తుంటారు. అయితే, ఇళ్లు కట్టుకోవాలనుకోవడం ప్రస్తుతమున్న ధరలతో చాలా కష్టతరమైన కార్యంగా ఉండిపోతున్నది. ఈ క్రమంలోనే ఎప్పటి నుంచో చాలా మంది ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు. కానీ, ఆచరణలో ముందుకు అడుగులు వేయడం లేదు. ఈ నేపథ్యంలో వారికి కేంద్ర ప్రభుత్వం తాజాగా శుభవార్త చెప్పింది.కేంద్రప్రభుత్వం తాజాగా లక్ష ఇళ్లకు పైగా నిర్మించనున్నట్లు తెలిపింది. ఇందుకు ఆమోదం కూడా తెలిపింది. ఆ స్కీమ్ వివరాల్లోకెళితే.. […]

 Authored By mallesh | The Telugu News | Updated on :29 December 2021,9:40 am

Modi: సొంతిళ్లు కట్టుకోవాలనుకుని ప్రతీ ఒక్కరు అనుకుంటారు. అందుకుగాను చాలా కాలం పాటు శ్రమిస్తుంటారు. అయితే, ఇళ్లు కట్టుకోవాలనుకోవడం ప్రస్తుతమున్న ధరలతో చాలా కష్టతరమైన కార్యంగా ఉండిపోతున్నది. ఈ క్రమంలోనే ఎప్పటి నుంచో చాలా మంది ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు. కానీ, ఆచరణలో ముందుకు అడుగులు వేయడం లేదు. ఈ నేపథ్యంలో వారికి కేంద్ర ప్రభుత్వం తాజాగా శుభవార్త చెప్పింది.కేంద్రప్రభుత్వం తాజాగా లక్ష ఇళ్లకు పైగా నిర్మించనున్నట్లు తెలిపింది. ఇందుకు ఆమోదం కూడా తెలిపింది. ఆ స్కీమ్ వివరాల్లోకెళితే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన ఆ స్కీమ్ పేరు ‘ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్’.

Modi: ఈ స్కీమ్ ప్రకారం ఇళ్ల నిర్మాణం..

ఈ స్కీమ్ కింద ఇళ్లను ప్రభుత్వం నిర్మించి ఇవ్వనుంది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహరాష్ట్ర, పుదుచ్చెర్రీ, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో ఈ ఇళ్లను నిర్మించనున్నట్లు సమాచారం. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా ఈ మేరకు తెలిపారు. సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ 57వ సమావేశంలో ఈ మేరకు డెసిషన్ తీసుకున్నారు. ఇప్పటి దాకా ఈ మిషన్ కింద రూ.1.14 కోట్ల ఇళ్లకు మంజూరు లభించగా, 53 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి అయింది. ఇంకా చాలా ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం కొనసా..గుతోంది. ఇకపోతే ఈ మిషన్ కోసం రూ.7.52 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం వెచ్చించనున్నది. వీటిలో కేంద్రం వాటా రూ.1.85 లక్షల కోట్లు కాగా, ఇప్పటికే రూ.1.14 లక్షల కోట్లు కేంద్రం మంజూరు చేసింది.

Modi govt sanctioned money for house construction to people

Modi  govt sanctioned money for house construction to people

ఇక ఇల్లు కట్టుకోవాలనుకునే వారు ఈ స్కీమ్ కోసం ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు. నేరుగా పీఎం ఆవాస్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ సిటిజన్ అసెస్‌మెంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ, ఆఫర్డబుల్ హౌసింగ్, ఇండివీజువల్ హౌస్ కన్‌స్ట్రక్షన్, స్లామ్ రీడెవలప్‌మెంట్ అనేవి ఉండగా, అందులో మీ ఆప్షన్ సెలక్ట్ చేసుకుని, ఆ తర్వాత ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆన్ లైన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. అంతే మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది