modi : ఇన్నాళ్లు మోడీ కాపాడుకుంటూ వచ్చిన పరువు గంగపాలు.. ఇప్పటికైనా మార్పు వచ్చేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

modi : ఇన్నాళ్లు మోడీ కాపాడుకుంటూ వచ్చిన పరువు గంగపాలు.. ఇప్పటికైనా మార్పు వచ్చేనా?

 Authored By himanshi | The Telugu News | Updated on :23 February 2021,8:30 pm

modi : నరేంద్ర మోడీ మొదటి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో యువత ఆయనపై చాలా ఆశలు పెట్టుకుంది. ఆయన్ను దేవుడిగా పూజలు చేసిన యువత ఇప్పుడు ఆయన్ను రాక్షసుడిగా చిత్రీకరిస్తూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలో మోడీ పై ట్విట్టర్ లో వ్యతిరేకంగా మూడు నాలుగు హ్యాష్‌ ట్యాగ్‌ లు ట్రెండ్‌ అవుతున్నాయి. ఉద్యోగం ఎక్కడ మోడీ అంటూ ఏకంగా 50 లక్షల మంది నిరుద్యోగులు ట్వీట్‌ చేయడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ లో మోడీకి అభిమానులు ఉన్నారు. ప్రపంచ దేశాల అగ్ర నేతల ట్విట్టర్ ఫాలోవర్స్ జాబితా తీస్తే మోడీ ముందు వరుసలో ఉంటాడు. అంతర్జాతీయ స్థాయిలో ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ అనూహ్యంగా తన స్థాయిని తానే దిగజార్చుకున్నాడు అంటూ విమర్శలు వస్తున్నాయి.

modi rojgar do is currently trending on Twitter

modi_rojgar_do is currently trending on Twitter

modi :  నిరుద్యోగులకు మండితే ఇంతే…

ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యలు చేపట్టి ఆరు సంవత్సరాలు దాటి పోయింది. మరి కొన్ని రోజుల్లో ఏడు ఏళ్లు కూడా పూర్తి చేసుకుంటుంది. ఇలాంటి సమయంలో నిరుద్యోగులు ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. నరేంద్ర మోడీ బాధ్యతలు తీసుకున్న తర్వాత నిరుద్యోగ శాతం రెట్టింపు అయ్యింది. కొత్త ఉద్యోగాల కల్పన విషయంలో పూర్తిగా మోడీ ప్రభుత్వం విఫలం అయ్యింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్‌ రంగాల్లో ఉద్యోగాల కొరత ఏర్పడింది. ఏం చేయాలన్నా కూడా యువతకు ఉపాది కరువు అయ్యింది. ఉపాది లేని యువత ఏం చేయాలో పాలు పోక రోడ్ల మీద తిరుగుతున్నారు. 30 ఏళ్ల లోపు యువతలో ఉద్యోగాలు చేసుకుంటున్న వారు కేవలం 30 20 శాతం మంది మాత్రమే. అందుకే నిరుద్యోగి కడుపు మండి సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ పెరిగాయి.

రాబోయే ఎన్నికల కోసమైనా మారడా..

ప్రధాని తన పాలనపై ఎన్ని విమర్శలు వస్తున్నా కూడా వాటిని కొట్టి పారేస్తూ ముందుకు వెళ్తున్నాడు తప్ప తన దారిని మాత్రం మార్చుకోవడం లేదు. పెద్ద ఎత్తున నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలు ఆయనకు పెద్దగా చెవికి ఎక్కినట్లుగా లేదు. గత వారం రోజులుగా సోషల్‌ మీడియాలో యువత రెచ్చి పోయి మరీ విమర్శలు చేస్తున్నా కూడా చూసి చూడనట్లుగానే వ్యవహరిస్తున్నారు. మొత్తానికి రాబోయే ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. అప్పటి వరకు కాంగ్రెస్ బలోపేతం అయితే పర్వాలేదు. లేదంటే ప్రధానికి అధికారం కట్టబెట్ట లేక కాంగ్రెస్‌ కు ఇచ్చే అవకాశం లేక మొత్తం హంగ్‌ పరిస్థితులు వచ్చేలా ఓటర్లు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు పరిపాలన మరింత గందరగోళంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది