Viral News : నిద్రపోతున్న తల్లి కూతుర్ల ప్రాణం తీసిన ఏసి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral News : నిద్రపోతున్న తల్లి కూతుర్ల ప్రాణం తీసిన ఏసి..!

 Authored By aruna | The Telugu News | Updated on :7 October 2023,1:00 pm

Viral News : ఇప్పుడు వర్షాకాలం అయినా ఎండలు మండిపోతున్నాయి. దీంతో చాలా మంది పట్ట పగలు కూడా ఏసీలు వాడుతున్నారు. చల్లని గాలిని ఇచ్చే ఏసి ఒక్కోసారి ప్రాణాలను కూడా తీసేస్తుంది. ఈమధ్య ఏసీలు పేలటం, షార్ట్ సర్క్యూట్ వలన చెలరేగడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా చెన్నై శివారులో తల్లి కూతుర్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఏసి పేలడంతో తల్లి కూతుర్లు మరణించారు. ఏసీ పేలడంతో చెలరేగిన మంటల లో తల్లి, కూతుర్లు సజీవ దహనం అయ్యారు.

చెన్నైలోని హలీనా కూతురు నజీయా ఇందిరా నగర్ సమీపంలో తమ ఇంట్లో నివసిస్తున్నారు. అయితే అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీలో పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గది మొత్తం మంటలతో నిండిపోవడంతో తల్లి కూతుర్లు అక్కడికక్కడే మృతి చెందారు. అది రాత్రి కావడంతో చుట్టూ ప్రక్కల వాళ్ళు గమనించకపోవడంతో తల్లి కూతుర్లు అగ్నిలో ఆహుతి అయ్యారు. మంటలు చెలరేగడంతో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసు అధికారులు చెప్పారు. అయితే కాసేపటి తర్వాత ఇంట్లో నుంచి భారీగా పగలు రావడాన్ని గమనించి ఇరువురు ఫైర్ స్టేషన్ కి సమాచారం అందించారు.

Mother and daughter died because of AC

Mother and daughter died because of AC

సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూశారు. అప్పటికే తల్లి కూతుర్లు ఇద్దరు మరణించినట్లు అధికారులు చెప్పారు. పోలీసులు తల్లి కూతుర్లు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఏసీలో మంటలు చెలరేగాయని భారీగా వచ్చిన పొగ కారణంగా ఊపిరి ఆడక చనిపోయారని తెలుస్తుంది. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భారీగా వచ్చిన పొగ కారణంగా తల్లి కూతుర్లు ఊపిరి ఆడక చనిపోయారు అందులోను నిద్రపోయే సమయం కావడంతో చుట్టు ప్రక్కల వాళ్ళు కూడా దీనిని గమనించలేదు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది