Categories: EntertainmentNews

Brahmamudi Serial Today Episode : గుడిలో కలుసుకున్న తల్లీకొడుకులు అపర్ణ, రాజ్.. షాక్‌లో కావ్య‌

Brahmamudi Serial Today Episode : బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు (ఏప్రిల్ 16) ఎపిసోడ్‌‌లో షర్ట్‌పై ఆర్ అనే లెటర్ ఎందుకు రాసిందో కావ్య ఎమోషనల్‌గా చెబుతుంది. అది మీకు జ్ఞాపకంగా మీ గుండెలకు దగ్గరిగా ఉండి గుర్తు చేస్తే మీరు నా దగ్గరికి వచ్చే అవకాశం ఉందిగా అని కావ్య అంటుంది. ఎంతలా ప్రేమించావో ఇప్పుడే అర్థమవుతోంది కళావతి అని రాజ్ అంటాడు. నేను నీకు ఎంత దూరం వెళ్లిన సరే నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూ నీ దగ్గరికి వచ్చేలా చేస్తాయి అంటాడు రాజ్. దాంతో రాజ్‌ను కావ్య ప్రేమగా హ‌త్తుకుంటుంది. అక్కడితో కావ్య తీయ‌ని ఊహ‌ అయిపోతుంది. ఇంతలో రాజ్‌కు కావ్య కాల్ చేయగానే నేనే చేద్దామనుకున్నాను అంటాడు రాజ్‌. అన్నదానం పనులు ఎంతవరకు వచ్చాయో తెలుసుకోవాలి కదా అంటే.. అవి నేను చూసుకుంటాను కదా. ఆ మాత్రం నాపై నమ్మకం లేదా అని కావ్య అంటుంది. స‌రే ఇప్పుడు మీకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు కాల్ చేశాను. మీకు ఓ కొరియర్ వస్తుంది. అది చూడండి అని కావ్య చెబుతుంది. దీంతో మళ్లీ కొరియర్ ఆ.. టిఫిన్ తెచ్చినప్పుడే యామిని పెద్ద గొడవ చేసింది. ఈసారి ఏమవుతుందో ఏమో అని భయపడతాడు రాజ్. ఇంతలో కొరియర్ అంటూ డెలివరీ బాయ్ వస్తాడు. అమ్మో యామిని కిందే ఉంది. తను వెళ్లి కొరియర్ తీసుకుంటే, కళావతి పేరు చెబితే మళ్లీ గొడవలు అవుతాయ్ అని పరుగెత్తుకుంటూ కిందకు వస్తాడు రామ్. ఎవరికీ వచ్చిందని యామిని అడిగితే.. నాకోసమే వచ్చింది. నేనే బుక్ చేశాను అని రామ్ అంటాడు.

Brahmamudi Serial Today Episode : గుడిలో కలుసుకున్న తల్లీకొడుకులు అపర్ణ, రాజ్.. షాక్‌లో కావ్య‌

నీకు నువ్వే సర్‌ప్రైజ్ ఇచ్చుకోడానికి బుక్ చేశావా అని యామిని అంటుంది. సర్‌ప్రైజ్ అయ్యావుగా. అందుకే చేశాను అని కొరియర్ తీసుకుని వెళ్లిపోతాడు రామ్. రాజ్ వెళ్లి కొరియర్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో వైట్ షర్ట్‌పై R లెటర్ ఉండడం చూసి సంతోషిస్తాడు. వావ్ అని మురిసిపోతాడు రాజ్. కావ్యకు కాల్ చేస్తాడు. గిఫ్ట్ అందిందా.. ఎలా ఉందని అడుగుతుంది కావ్య. అద్భుతంగా ఉందని అంటాడు రాజ్‌. అది చూస్తే ఏమైనా గుర్తు వచ్చిందా అని కావ్య అడిగితే.. వచ్చింది.. నాపై మీకున్న అభిమానం తెలిసింది. ఇంకేం గుర్తు రాలేదా అని కావ్య అడిగితే.. ఇంకేం గుర్తు రావాలండి అని రాజ్ అంటాడు. ఏం లేదు. మీకు నచ్చిందా లేదా అని అంటుంది.మరుసటి రోజు ఉదయం అన్నదానం కోసం క్యారేజ్‌లను డ్రైవర్‌తో పంపిస్తుంటుంది కావ్య. ఏంటీది పొద్దుపొద్దునే ఇన్ని క్యారేజీలు పంపిస్తుంది. దీని బాబుగాడి సొమ్ము అయినట్లు చేస్తుంది అని రుద్రాణి రాహుల్‌తో అంటుంది. శ్రీవారు ఇంకా బతికే ఉన్నారని భ్రమపడుతున్న శ్రీమతి గారు ఏదో కార్యం తలపెట్టారేంటీ అని రుద్రాణి అడిగితే.. శుభకార్యమే లెండి అని కావ్య అంటుంది. అశుభం జరిగిన ఇంట్లో శుభకార్యమా అని రుద్రాణి అంటుంది.

తర్వాత కావ్య పంచ్‌లు వేస్తుంది. ఇంతలో అపర్ణ వచ్చి అన్ని సర్దేశావా అని హడావిడి చేస్తుంది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను అని కావ్య చెబుతుంది. అపర్ణ మాటలు చూసి ఇంట్లోవాళ్లంతా షాక్ అవుతారు. ఈవిడ నిన్నటివరకు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పేషంట్‌లా కనిపించింది. ఇవాళ ఏంటీ మనిషిలో ఉత్సాహం, మాటల్లో ఉల్లాసం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అని రుద్రాణి అంటుంది. కావ్య ఏం చెప్పి ఒప్పించిందో కానీ ఆంటీ ఒక్కపూటలో మొత్తం మారిపోయారు కదా అని స్వప్న అంటుంది. కావ్య పూనుకున్నాక కానిపని ఉంటుందా అని ఇందిరాదేవి అంటుంది. అపర్ణ తన పుట్టినరోజు నాడే మళ్లీ పుట్టినట్లు అనిపిస్తుంది. తన మొహం వెలిగిపోతుంటే ఇంటికే వెలుగొచ్చినట్లుంది అని సుభాష్ అంటాడు. హ్యాపీ బర్త్ డే అని సుభాష్ చెబుతాడు. తర్వాత అంతా చెబుతారు. రాలిపోతుందేమో అనుకున్న పువ్వు రాగాలు పలుకుతున్నట్లు వదిన గారేంటీ చాలా హుషారుగా ఉన్నారు అని రుద్రాణి అంటుంది.

పువ్వులు రాలిపోవాలి, కొమ్మలు కూలిపోవాలి అనుకునేవారికి ఎలా నచ్చుతాయి అని స్వప్న అంటుంది. బాధలో కూడా బర్త్‌డేలు చేసుకుంటారని మా మమ్మీకి తెలియదులే అని రాహుల్ అంటాడు. ఈ ఇంట్లో జరగరానిది జరిగితే చాలా బాధపడేది మీ మమ్మీనేగా అని స్వప్న కౌంటర్ వేస్తుంది. నువ్వేంటీ వదినా ఇలా మారిపోయావ్. కొడుకే లేడు. వాడు లేనప్పుడు ఇవన్నీ ఎందుకు అన్నావ్. ఇప్పుడేంటీ ఇంత అందంగా రెడీ అయి ఏదో నీ కొడుకే అన్నదానం జరిపిస్తున్నాడన్నట్లుగా ఆ రేంజ్‌లో వెళ్తున్నావేంటీ అని రుద్రాణి అడుగుతుంది.

Brahmamudi Serial Today Episode అన్న‌దానం జ‌రిపించేది నా కొడుకే

అక్కడ నా అన్నదానం చేయించేది నా కొడుకే కదా అని అపర్ణ అనడంతో ఇంటిల్లిపాది షాక్ అవుతారు. అంటే రాజ్ అన్నదానం జరిపిస్తున్నట్లేగా. నా కోడలులో నా కొడుకుని చూసుకోవడంలో తప్పేముంది అని అంటుంది అపర్ణ. వదినకు ఏదో అయింది. కావ్య ఒక్కతే పిచ్చిది అనుకున్నాను. నిన్ను కూడా పిచ్చిదాన్ని చేసిందా. ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో అని రుద్రాణి అంటుంది. రుద్రాణి, కావ్య గుడికి వెళ్తారు. మరోవైపు కారులో నుంచి దిగి రాజ్ గుడిలోకి వస్తాడు. రాజ్‌ను చూసి అపర్ణ సంబరపడిపోతుంది. నా కొడుక్కి ఏం కాలేదు అని రాజ్‌కు ఎదురుగా వెళ్తుంది అపర్ణ. రాజ్‌కు ఎదురుపడి అపర్ణ చాలా సంతోషిస్తుంది. ఇంతలోనే అమ్మా అని రాజ్ పిలుస్తాడు. దాంతో అపర్ణ ఆశ్చర్యంతో ఆగిపోతుంది. అదంతా చూస్తున్న కావ్య షాక్ అవుతుంది. అత్తయ్య గారిని గుర్తుపట్టేశారా అని కావ్య అనుకుంటుంది. అపర్ణ దగ్గరికి వెళ్తాడు రాజ్. అపర్ణ, రాజ్ ఇద్దరు కలుసుకుంటారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Recent Posts

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

8 hours ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

11 hours ago

Health Tips | భోజనం తర్వాత తమలపాకు తినడం కేవలం సంప్రదాయం కాదు.. ఆరోగ్యానికి అమృతం!

Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…

12 hours ago

Dried Chillies | ఎండు మిర‌ప‌తో ఎన్నో లాభాలు.. ఆరోగ్యంలో చేర్చుకుంటే చాలా ఉప‌యోగం..!

Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…

15 hours ago

Black In Color | న‌లుపుగా ఉండే ఈ ఫ్రూట్స్ వ‌ల‌న అన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..!

Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…

17 hours ago

Karthika Masam | కార్తీక మాసంలో 4 సోమవారాలు.. నాలుగు వారాలు ఈ ప్ర‌సాదాలు ట్రై చేయండి

Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…

20 hours ago

Dresses | ఫ్యాషన్‌ కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టకండి .. బిగుతుగా ఉండే దుస్తులు కలిగించే ప్రమాదాలు

Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…

1 day ago

Health Tips | బ్రహ్మీ,వందకు పైగా రోగాలకు ఔషధం .. ఆయుర్వేదం చెబుతున్న అద్భుత లాభాలు

Health Tips | ఆయుర్వేదం చెప్పే ప్రతి మూలికకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే వాటిలో “బ్రహ్మీ” అనే ఔషధ…

1 day ago