Telangana:ఇటీవలి కాలంలో చిన్న పిల్లలకు కూడా గంజాయికి బానిసలుగా మారుతున్న విషయం తెలిసిందే. పోలీసులు, అధికారులు.. మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపిన కూడా గంజాయి విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు గంజాయికి బానిసలుగా మారుతున్నారు. తాజాగా సూర్యాపేట లో గంజాయి కి బానిసగా మారిన కొడుకును మార్చుకునేందుకు ఓ తల్లి పడుతున్న కష్టం చూస్తే ప్రతి ఒక్కరి మనసు చలించక మానదు. కోదాడ కు చెందిన 15 ఏళ్ల యువకుడు గంజాయికి బానిసగా మారాడు. ఇంటికి రాకుండా అల్లరి చిల్లరగా తిరుగుతూ గంజాయి సేవిస్తున్నాడు. ఎంత చెప్పిన వినకుండా ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాడు.
రోజూ గంజాయి మత్తులో ఊగిపోతున్నాడు. కళ్లముందే తాను కన్న కల గంజాయి రూపంలో ఆవిరవుతుంటే ఆ తల్లి తట్టుకోలేకపోయింది. కొడుకును ఎలాగైనా దారికితెచ్చుకోవాలని మమకారం చంపుకుని కొడుకును తాళ్లతో చెట్టుకు కట్టేసి కంట్లో కారంపెట్టింది. ఏం చేయాలో దిక్కుతోచక చేతికి దొరికిన కొడుకును స్తంభానికి కట్టేసి కళ్లలో కారం పెట్టింది తల్లి. కన్నీళ్లు పెట్టుకొని చెప్పినా వినడం లేదని..అందుకే ఇలా చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తోందామె. గంజాయి లేకుండా చర్యలు తీసుకోవాలని..తన కొడుకును ఈ మత్తు బారి నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటోందామె.
కోదాడలో ఈ ఒక్క తల్లిదే కాదు. డ్రగ్స్, గంజాయికి బానిసలుగా మారిన ప్రతి బిడ్డ తల్లిదీ ఇదే ఆవేదన. చెడు వ్యసనాల బారిన పడిన కొడుకులను ఎలా దారిన పెట్టుకోవాలో తెలియక ఎంతో మంది మథనపడిపోతున్నారు. గంజాయికి బానిసలైన వారిని డి-అడిక్షన్ సెంటర్లకు తరలించి చికిత్స చేయించాలని కోరుతున్నారు. గంజాయి, డ్రగ్స్ ఇప్పుడు పెను భూతాలుగామారి కడుపుకోతను మిగిలిస్తున్నాయి. చెట్టంత కొడుకు ఓ వ్యసనానికి బానిసై చేతికిరాకుండా పోతుంటే తల్లిదండ్రులు పరిస్థితి హృదయ విదారకంగా మారింది.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.