Waterfall mystery : ఈ జలపాతానికి శాపం ఉందా? అందులో పడితే ఏదైనా రాయిగా మారుతుందా? మనుషులు అందులో పడితే ఎలా?
Waterfall Mystery : ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు. మన దేశంలోనే కాదు.. ఇతర దేశాల్లోనూ ఎన్నో వింతలు విచిత్రాలు జరుగుతుంటాయి. వాటి గురించి తెలుసుకొని వామ్మో.. అలాగా… అని ముక్కున వేలేసుకుంటాం. అలాంటి వాటిలో ఒక దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అది ఒక జలపాతం. అది అద్భుతమైనది. ఆ జలపాతంలో ఏం పడినా అది రాయిగా మారిపోతుంది. ఇది వినడానికి విడ్డూరంగా అనిపించినా అది అక్షర సత్యం. ఈ జలపాతం పేరు మదర్ షిప్టన్ కేవ్. అసలు ఈ జలపాతం ఎక్కడుంది. అందులో ఏం పడినా ఎందుకు రాయిలా మారిపోతాయి.. అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.మీకు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన, చరిత్రకు సంబంధించిన వీడియోలు కావాలంటే ఈ చానెల్ ను ఫాలో అవండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి.
ఈ జలపాతం పూర్తి పేరు. మదర్ షిప్టన్ కేవ్. దీన్నే డ్రాపింగ్ వెల్ అని కూడా పిలుస్తారు. ఇంగ్లండ్ లోని నార్త్ యోర్క్ షైర్ అనే ప్రాంతంలో ఉంది. ఇక్కడ నిడ్ అనే ఒక నది ప్రవహిస్తుంది. ఈ నదికి సమీపంలో ఒక కొండలో నుంచి చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ ఒక జలపాతంలా కిందికి ప్రవహిస్తుంది. అయితే.. ఈ జలపాతంలో ఏం వేసినా రాయిలా మారుతుంది. పొరపాటున మనుషులు అందులోకి దిగినా కూడా రాయిగా మారిపోతారు. మరి.. ఈ జలపాతం మిస్టరీ వెనుక కొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇక్కడి ప్రజలు ఈ జలపాతం గురించి చెప్పేదేంటంటే.. పూర్వం ఈ జలపాతం దగ్గర అఘాధ అనే ఓ యువతి నివసించేది. బతుకు తెరువు కోసం అఘాధా వేశ్య వృత్తిలోకి దిగింది.
తనకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు గర్భం దాల్చింది. చివరకు అఘాధా ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ పాపకు మదర్ షిప్టన్ అనే పేరు పెట్టింది. ఉర్సులా అనే పేరుతో కూడా పాపను పిలిచేవారు. కష్టపడి ఆ పాపను అఘాధా పెంచుకుంటూ వచ్చింది. తర్వాత ఆ పాపను ఓ కుటుంబానికి గ్రామస్తులు దత్తత ఇచ్చారు అక్కడి స్థానికులు. అఘాధాను ఊరికి దూరంగా ఉన్న ఓ సన్యాసి గుంపులో బతికేందుకు పపించేస్తారు. ఉర్సులా అంత అందంగా ఉండదు. తను వయసుకు వచ్చాక ఇంకా అంద విహీనంగా మారిపోయింది. తన రూపాన్ని అందరూ అసహ్యించుకుంటూ ఉండటంతో అడవిలోని తను పుట్టిన గుహలోకి వెళ్లిపోతుంది. అక్కడే ఉండిపోతుంది. అడవిలో ఉన్న మొక్కలు, మూలికల గురించి తెలుసుకొని వాటితో వైద్యం ఎలా చేయాలో నేర్చుకుంటుంది.
తనకు 24 ఏళ్లు వచ్చిన తర్వాత అడవిలోకి వచ్చిన టొబియా షిప్టన్ అనే వడ్రంగితో తనకు పరిచయం ఏర్పడుతుంది. చివరకు వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఈ విషయం ఊరి ప్రజలకు తెలిసి ఆ అమ్మాయి అసహ్యంగా ఉన్నా ఆ అబ్బాయి ఎలా వివాహం చేసుకున్నాడు అని అనుకుంటారు. ఆ అబ్బాయిపై మంత్రం చేసి ఉంటుంది అంటూ ప్రచారం చేశారు. ఆ తర్వాత రెండేళ్లకే తన భర్త చనిపోవడంతో తనొక్కతే ఆ గుహలోనే ఉండేది. ఆ తర్వాత తను ఒక మంత్రగత్తెగానే ముద్ర వేసుకుంది. ముందుగా జరగబోయే విషయాలను తను ముందే పసిగట్టేది. ఉర్సులా చెప్పే విషయాలు నిజం అవుతుండటంతో తన పేరు అక్కడ మారుమోగిపోయింది. అంతే కాదు.. తనను ఒక గొప్ప మంత్రగత్తె అంటూ చెప్పుకునేవారు. చివరకు తను 1561 లో మరణించింది. తను నివసించిన ఈ గుహలో నుంచి వచ్చే నీరు.. మాయా నీరు అని.. ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ఉర్సులా చనిపోయిన తర్వాత ఈ జలపాతం మాయా జలపాతంగా మారిందని.. అందుకే ఈ నీటిలో ఏది పడ్డా రాయిగా మారుతుందని ప్రజలు చెబుతున్నారు. ఇది ఇక్కడి ప్రజలు చెబుతున్న కథ.
మరోవైపు ఈ జలపాతం గురించి సైంటిస్టులు ప్రయోగం చేయగా.. ఏం తెలిసిందంటే. ఈ జలపాతం ప్రవహించే మార్గంలో సున్నపురాయి ఉందని.. ఈ సున్నపు రాయి ఈ నీటిలో కరగడం వలన ఈ నీటిలో ఏర్పడే మార్పు వలన ఈ నీరు దేనినైనా తాకినప్పుడు ఈ సున్నపురాయి నిక్షేపాలు ఆ వస్తువుపై ఏర్పడటం ప్రారంభిస్తాయని.. కొంత కాలం తర్వాత ఆ వస్తువును అది రాయిగా మారుస్తుందని సైంటిస్టులు తెలిపారు. ఈ నీటిలో సల్ఫైడ్, కార్బోనేట్ లు కూడా ఎక్కువగా ఉంటాయని సైంటిస్టులు తెలిపారు. అందుకే ఈ జలపాతంలో ఏ వస్తువులు పడినా శిలలుగా మారుతాయని చెప్పారు. ఈ జలపాతం వద్ద చాలామంది టూరిస్టుల వస్తువులను చూడొచ్చు. అవి రాయిగా మిగిలి ఇప్పటికీ టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియో మీకు ఎంతో కొంత సమాచారాన్ని అందించిందని మేము భావిస్తున్నాం. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోలను ఈ చానెల్ లో మీకోసం త్వరలో అందిస్తాం.