Viral Video : సెల్ఫీ తీసుకుంటూ 2000 అడుగుల జలపాతంలో జారిపడ్డ యువకుడు వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : సెల్ఫీ తీసుకుంటూ 2000 అడుగుల జలపాతంలో జారిపడ్డ యువకుడు వీడియో వైరల్..!!

Viral Video : సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మనిషి ఏ రకంగా ప్రవర్తించాలో దానికి వ్యతిరేకంగా కెమెరా కోసం బతికే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఒకపక్క మనుషులు చచ్చిపోతున్నా అక్కడికి వెళ్లి సెల్ఫీలు దిగుతూ.. లేదా లైవ్ ఇస్తూ పాపులారిటీ సంపాదించుకునే ఆలోచనతో ఉన్నారు తప్ప మనుషులను కాపాడే ఆలోచన ప్రస్తుత సమాజంలో ఎవరికి లేకుండా పోతుంది. ఒకప్పుడు వాస్తవ పరిస్థితుల్లో బతికే మనిషి ప్రస్తుతం.. టెక్నాలజీ రూపంలో సెల్ ఫోన్ లో ఉన్న కెమెరా […]

 Authored By sekhar | The Telugu News | Updated on :25 July 2023,1:00 pm

Viral Video : సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మనిషి ఏ రకంగా ప్రవర్తించాలో దానికి వ్యతిరేకంగా కెమెరా కోసం బతికే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఒకపక్క మనుషులు చచ్చిపోతున్నా అక్కడికి వెళ్లి సెల్ఫీలు దిగుతూ.. లేదా లైవ్ ఇస్తూ పాపులారిటీ సంపాదించుకునే ఆలోచనతో ఉన్నారు తప్ప మనుషులను కాపాడే ఆలోచన ప్రస్తుత సమాజంలో ఎవరికి లేకుండా పోతుంది.

ఒకప్పుడు వాస్తవ పరిస్థితుల్లో బతికే మనిషి ప్రస్తుతం.. టెక్నాలజీ రూపంలో సెల్ ఫోన్ లో ఉన్న కెమెరా కోసం బతికే పరిస్థితి నెలకొంది. ఈ రకంగానే కొంతమంది వ్యవహరిస్తూ తమ ప్రాణాలపైకి పరిస్థితులను తెచ్చుకుంటున్నారు. చాలామంది సెల్ఫీలు పిచ్చిలో పడి చాలా ప్రమాదకరమైన ప్రాంతాలలో ఫోటోలు దిగుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. ఈ రకంగానే సెల్ఫీ తీసుకుంటూ 2,000 అడుగుల జలపాతంలోకి ఓ యువకుడు జారిపడ్డాడు. పూర్తి వివరాలలోకి వెళ్తే మహారాష్ట్ర – అజంతా గుహల వద్ద సెల్ఫీ కోసం పోజులిస్తూ ఓ యువకుడు జలపాతంలో జారిపడ్డాడు.

young man who slipped into waterfall Viral Video

young man who slipped into waterfall Viral Video

ఈత రావడంతో అతడు ఓ రాయిని పట్టుకుని ఉండగా పోలీసులు, అధికారులు కలిసి అతడిని కాపాడారు. ఈ క్రమంలో ఆ జలపాతంలో ఒక పెద్ద తాడును దింపి అతడి శరీరానికి టై అప్ చేసి… ఏదో రకంగా మెల్లగా.. సురక్షితంగా బయటకు తీశారు. లోయలో పడిన యువకుడిని పోలీసులు కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది