Vomtings | ప్రయాణంలో వికారంగా ఉంటుందా.. అయితే అది తగ్గించుకోవడానికి ఉపయోగకరమైన చిట్కాలు
Vomtings |
చాలామందికి కారు లేదా బస్సులో ప్రయాణించే సమయంలో వికారం, వాంతులు కలిగే సమస్య ఎదురవుతుంది. దీనిని మోషన్ సిక్‌నెస్ అంటారు. నిపుణుల ప్రకారం కారు ముందు సీట్లో లేదా కిటికీ దగ్గర కూర్చోవడం వల్ల వికారం వచ్చే అవకాశం తక్కువ. ఎందుకంటే రోడ్డును నేరుగా చూడటం వల్ల మెదడు-కంటి సమన్వయం సులభమవుతుంది. అలాగే గాలి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల అసౌకర్యం తగ్గుతుంది.

#image_title
వికారం తగ్గించే సూచనలు
తల తిరగడాన్ని తగ్గించుకోవడానికి తలను నిటారుగా ఉంచడం, కారు హెడ్‌రెస్ట్ లేదా చిన్న దిండు ఉపయోగించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వాహనంలో ఆక్సిజన్ లేకపోవడం, బలమైన వాసనలు వాంతికి కారణం అవుతాయి. కాబట్టి కిటికీ తెరిచి ఉంచడం లేదా ఎయిర్ కండిషనింగ్ ఉపయోగించడం వల్ల శ్వాస సులభతరం అవుతుంది. ప్రయాణానికి ముందు ఖాళీ కడుపుతో ఉండడం, లేదా ఎక్కువగా తినడం రెండూ వాంతికి కారణమవుతాయి.
కాబట్టి టోస్ట్, బిస్కెట్లు, అరటిపండ్లు వంటి తేలికైన ఆహారాలను మాత్రమే తీసుకోవాలి. వేయించిన, కారంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రయాణ సమయంలో పుష్కలంగా నీరు తాగడం అవసరం. కానీ ఒకేసారి ఎక్కువగా తాగకూడదు. బదులుగా నిమ్మరసం, అల్లం టీ, పుదీనా రసం వంటి పానీయాలు వికారం తగ్గించడంలో సహాయపడతాయి. అల్లం మిఠాయి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మరోవైపు, కదులుతున్న వాహనంలో పుస్తకాలు చదవడం, మొబైల్ చూడడం చేయకూడదు. ఇవి కంటి-చెవి సమతుల్యతను దెబ్బతీసి వికారాన్ని పెంచుతాయి.