Avinash Reddy : అవినాష్ రెడ్డికి బెయిల్ ఇస్తూ జడ్జిగారు ఏమన్నారో చూడండి !
Avinash Reddy : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కాస్త కడప ఎంపీ అవినాష్ రెడ్డి మెడకు చుట్టుకుంది. ఆ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు ఇప్పటికే అవినాష్ రెడ్డికి పలుమార్లు నోటీసులు ఇచ్చారు. విచారించారు కూడా. దీనిపై తెలంగాణ హైకోర్టుకెక్కారు అవినాష్ రెడ్డి. దానికి సంబంధించిన తీర్పును తాజాగా తెలంగాణ హైకోర్టు వెలువరించింది. వెకేషన్ బెంచ్ జస్టిస్ లక్ష్మణ్ ఇచ్చిన తీర్పు ప్రకారం చూసుకుంటే.. ఆ తీర్పులో వివేకానంద హత్య తీరు, దర్యాప్తు సంస్థల రికార్డులను, నిందితుల వివరాలను పొందుపరిచారు.
ఈ తీర్పు ప్రకారం, సీబీఐ దర్యాప్తు ప్రకారం చూస్తే అసలు వివేకానందరెడ్డిని హత్య చేసింది గంగిరెడ్డి, యాదాటి సునీల్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి అని తేలింది. ఈ నలుగురు వివేకాను హత్య చేయడం వెనుక పలు రకాల కారణాలు ఉన్నాయి. వేరు వేరుగానే వాళ్లకు, వివేకాకు మధ్య వైరుధ్యాలు ఉన్నాయి. ఎర్రగంగిరెడ్డికి, వివేకానందరెడ్డికి మధ్య పలు రియల్ ఎస్టేట్ లావాదేవీలు జరిగాయి. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య పలు విభేదాలు వచ్చాయి.
Avinash Reddy : బెంగళూర్ సెటిల్ మెంట్ పై సునీల్ యాదవ్, వివేకాకు గొడవ
బెంగళూరు సెటిల్ మెంట్ లో వివేకానంద రెడ్డికి, సునీల్ యాదవ్ కి మధ్య పొసగలేదు. తనకు బెంగళూరు సెటిల్ మెంట్ లో డబ్బులు రాలేదని వివేకాపై ఆయన కోపంతో ఉండేవాడు. వీళ్ల మధ్య వజ్రాల లావాదేవీలు కూడా నడిచేవి. అలా ఇద్దరి మధ్య వైరం పెరిగింది. ఆ తర్వాత ఉమాశంకర్ రెడ్డి, వివేకాకు మధ్య చాలా విభేదాలు ఉన్నాయి. అలాగే.. తన కారు డ్రైవర్ దస్తగిరి.. వివేకాపై కోపంగా ఉండేవాడు. తనను అకారణంగా డ్రైవర్ గా తొలగించాడని కోపం పెట్టుకున్నాడు. అలాగే.. వేరే కారణాలు కూడా ఉన్నాయి. ఇలా నలుగురు తమ వేర్వేరు పగలను దృష్టిలో పెట్టుకొని కలిసి వివేకాను అంతమొందించారు అని తీర్పులో బెంచ్ పేర్కొంది.