revanth reddy
Revanth Reddy టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి Revanth Reddy పార్టీ పటిష్టత కోసం వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు.. అధికార టీఆర్ఎస్ లక్ష్యంగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు..ఈనేపథ్యంలోనే సీఎం కేసిఆర్ దత్తత గ్రామంలో రెండు రోజుల పాటు నిరహార దీక్ష చేపట్టనున్నారు.. అధికార టీఆర్ఎస్‌కు ఫుల్ స్టాప్ పెట్టి… రానున్న రెండేళ్లలో బలోపేతం చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు.. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ వ్యతిరేక కార్యక్రమాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు..
ముఖ్యంగా సీఎం కేసీఆర్ KCR ఇచ్చిన హామీలపై దృష్టిసారించారు.. ఇందుకు అనుగుణంగా సీఎం కేసిఆర్ దత్తత గ్రామాల పేరు మీద చేస్తున్న రాజకీయ ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టెందుకు రేవంత్ రెడ్డి సిద్దమయ్యారు..కాగా ఇటివల వాసాల మర్రిని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే..ఆ ఊరిని అన్ని విధాల అభివృద్ది పరిచేందుకు గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగానే దళిత బంధును తొలిసారి వాసాలమర్రి దళితులకు అందించారు. గ్రామంలో ఉన్న దళిత కుటుంబాలకు పదిలక్షల రూపాయలు విడుదల చేశారు.
revanth reddy
అయితే వాసాలమర్రి గ్రామం కన్నా ముందే సీఎం కేసిఆర్ మల్కాజ్‌గిరి మేడ్చల్ జిల్లాలోని మూడు గ్రామాలను దత్తత తీసుకున్నారు. మూడుచింతలపల్లి గ్రామం, లక్ష్మాపూర్‌తోపాటు కేశవరం గ్రామాలు కాగా, ఇవన్నీ కేసీఆర్ ఎర్రవెల్లి ఫాం హౌజ్‌కు వెళ్లే దారిలో ఉన్నాయి.. అయితే వీటిని దత్తత తీసుకున్నా, కనీస అభివృద్దికి కూడా నోచుకోలేదు. దీంతో ఇప్పుడు ఆ గ్రామాలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది..గత కొన్ని సంవత్సరాల క్రితం దత్తత తీసుకున్న గ్రామాల రూపు రేఖలే ఇంకా మారలేదంటూ కాంగ్రెస్ ప్రచారం చేపట్టింది.
దీనిలో భాగంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మూడుచింతల పల్లి గ్రామంలో 24 నుండి రెండు రోజుల పాటు దీక్ష చేసేందుకు సిద్దమయ్యారు.. దీంతో ఆ గ్రామాల్లో పాగా వేయడంతోపాటు తన పార్లమెంట్ నియోజకర్గంలోకి వచ్చే గ్రామాలు కావడం రేవంత్ రెడ్డికి ప్లస్ అయిందని టాక్ వినిపిస్తోంది. అటు కేసీఆర్ పై వ్యతిరేకత, ఇటు సొంత నియోజకవర్గంలో బలోపేతం దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.
TRS Party
దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరిట రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లోని ఇంద్రవెల్లిలో, రావిర్యాలలో కాంగ్రెస్ సభలు విజయవంతం అయ్యాయి. అదే ఊపుతో ఆగస్టు 24న సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలో దీక్ష చేపట్టనున్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి గ్రామంలోల పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 48 గంటల దీక్ష చేపట్టనున్నట్లు సమాచారం. తొలుత సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్‌లో దళిత దండోరా సభ పెట్టాలని రేవంత్ రెడ్డి భావించారు. ఐతే తక్కువ సమయంలో జనసమీకరణకు ఇబ్బందులు ఎదురవుతాయని కాంగ్రెస్ పార్టీ భావించింది.
kcr
ఈ క్రమంలోనే గజ్వేల్‌లో సభకు బదులుగా సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలో దీక్ష చేపట్టాలని రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకోసం భారీ జనసమీకరణ చేయాలని వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గ కోఆర్డినేటర్, మూడుచింతలపల్లి జెడ్పీటీసీ సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో జనసమీరణ చేయనున్నారు. ఈ దీక్షలో పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు పాల్గొనున్నారు. పార్టీ పెద్దలు హాజరయ్యే ఈ దీక్షను విజయవంతం చేసేందుకు.. గజ్వేల్, మేడ్చల్ నియోజకవర్గాల నేతలు కృషిచేయాలని హైకమాండ్ ఆదేశించినట్లు సమాచారం.
మరోవైపు గజ్వేల్‌లో రేవంత్ రెడ్డి సభపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు తెలిసింది. పార్టీలో ఇతర నేతలతో చర్చించకుండానే సీఎం నియోజకవర్గంలో సభను ఎలా ఏర్పాటు చేస్తారని పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. గజ్వేల్‌లో సభ ఏర్పాటు చేయడానికి బదులుగా మెదక్‌లో సభ ఏర్పాటు చేయాలని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజర్సింహ సూచించారని టాక్.
గజ్వేల్‌లో సభ ఏర్పాటు చేసే విషయంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా అంత సుముఖంగా లేరనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే కేసీఆర్ దత్తత గ్రామంలో దీక్ష చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వర్గాలను ఏకం చేసి అనంతరం రాజ్యాధికారం దిశగా ఆయన పావులు కదుపుతున్నారు..
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
This website uses cookies.