ఎంపీ నుంచి ఎమ్మెల్యేకు మారిన శ్రీ భరత్ రాజకీయం.. ఈసారైనా కలిసివచ్చేనా..!
Sri Bharath విశాఖ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తోన్న బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ రూటు మార్చారు. లోకేష్‌కు తోడల్లుడైన మెతుకుమిల్లి శ్రీ భరత్ Sri Bharath గత ఎన్నికల్లోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసిన భరత్ కేవలం 3 వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఓటమి తర్వాత సైలెంట్ అయిన ఆయన మళ్లీ ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు. పార్టీ కార్యకర్తల కష్టసుఖాలు తెలుసుకోవడంతో పాటు పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ యాక్టీవ్ వెనుక మళ్లీ ప్రజాక్షేత్రంలోకి దూకాలన్నదే అసలు ఏజెండా అని టాక్ నడుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో భరత్ మళ్లీ విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదని సన్నిహితులు చెబుతున్నారు. దీంతో ఆయన కన్ను అసెంబ్లీపై పడిందని కేడర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అసెంబ్లీ దిశగా.. Sri Bharath
లోకేష్ కు మద్ధతుగా శ్రీభరత్ ఈ దఫా అసెంబ్లీ బరిలో ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నట్టు పార్టీ వర్గాలే చెపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకే భరత్ భీమిలి లేదా విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గాలపై కాన్‌సంట్రేషన్ చేస్తున్నారు. నార్త్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా ఇప్పటికే రాజీనామా సమర్పించేశారు. ఇక ఆయన సీటు ఖాళీ అయినట్లే. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ గంటాకు సీటు ఇచ్చే ప్రశ్నే లేదని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఈ సీటు నుంచి బరిలోకి దిగాలని శ్రీ భరత్ పావులు కదుపుతున్నారు. గంటా పార్టీకి ఎప్పుడు షాక్ ఇచ్చినా, సిద్ధంగా ఉండాలని ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు. అందులో భాగంగానే నియోజకవర్గంలో పట్టు పెంచుకునేలా, ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ నార్త్ కుదరని పక్షంలో మరో అసెంబ్లీ నియోజకవర్గంపై శ్రీ భరత్ కన్నేశారని స్థానిక కేడర్ చెబుతోంది.
భీమిలిపైనా కన్ను.. Sri Bharath
టీడీపీకి ఎప్పుడూ కంచుకోటగా ఉంటూ వస్తోన్న భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అయినా భరత్ పోటీ చేస్తారనే అంటున్నారు. ఏదేమైనా ఈసారి భరత్ మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీ బరిలోనే ఉంటారని తెలుస్తోంది. పైగా ఈ స్థానంలో భరత్ కు వ్యతిరేకంగా వెలగపూడి పనిచేశారని, ఆయనకు చెక్ పెట్టేందుకే లోకేష్ స్వయంగా భరత్ ను అక్కడి నుంచి రంగంలోకి దింపుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం భీమిలికి తాత్కాలిక ఇన్‌చార్జ్‌గా కోరాడ రాజబాబును నియమించినా తర్వాత పరిస్థితులను బట్టి అక్కడ భరత్ పోటీ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరోవైపు లోకేష్ సైతం నియోజకవర్గం మారుతున్నందున, భరత్ కూడా అదే బాట పట్టారని కేడర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీ భరత్ నిర్ణయం విశాఖ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. లోకేష్ వెంటే ఉండేలా పార్టీ అధినేత ప్లాన్ చేస్తున్నారని కేడర్ చర్చించుకుంటోంది.