YS Avinash Reddy Vs YS Sharmila : వైయస్ వివేకానంద రెడ్డి హత్య పై అవినాష్ వర్సెస్ షర్మిల వీడియో..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Avinash Reddy Vs YS Sharmila : వైయస్ వివేకానంద రెడ్డి హత్య పై అవినాష్ వర్సెస్ షర్మిల వీడియో..!!

YS Avinash Reddy Vs YS Sharmila : వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఉన్న కొద్ది సంచలనం సృష్టిస్తూ ఉంది. ఈ కేసులో కొత్తవారిని సీబీఐ విచారించటం మరింత ఆసక్తిని పెంచుతూ ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ కేసు గురించి వైయస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ… కావాలని తనని ఇరికించినట్లు మాట్లాడుకొచ్చారు. శివ ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి తనకు ఫోన్ చేసి.. వైయస్ వివేకానంద రెడ్డి చనిపోయినట్లు చెప్పారు. ఈ విషయాన్ని […]

 Authored By sekhar | The Telugu News | Updated on :29 April 2023,10:00 am

YS Avinash Reddy Vs YS Sharmila : వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఉన్న కొద్ది సంచలనం సృష్టిస్తూ ఉంది. ఈ కేసులో కొత్తవారిని సీబీఐ విచారించటం మరింత ఆసక్తిని పెంచుతూ ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ కేసు గురించి వైయస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ… కావాలని తనని ఇరికించినట్లు మాట్లాడుకొచ్చారు. శివ ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి తనకు ఫోన్ చేసి.. వైయస్ వివేకానంద రెడ్డి చనిపోయినట్లు చెప్పారు. ఈ విషయాన్ని నాకంటే ముందుగానే… వైయస్ వివేకానంద రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ కి తెలియజేయడం జరిగింది.

How a four-year-old murder split Andhra Pradesh's ruling family | News9live

అయితే నేను సంఘటన స్థలానికి వెళ్లకముందే అక్కడ ఒక మొబైల్ ఇంకా లెటర్ నీ దాచిపెట్టి… వాటిని పిఏ నరేడ్డి రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వెంటనే వివేకా అల్లుడు వాటిని దాచి పెట్టాలని… చెప్పటం జరిగింది. ఈ రకంగా కావాలని నన్ను.. ఈ కేసులో ఇరికించినట్టుగా అవినాష్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఫస్ట్ తానే పోలీసులకు విషయాన్ని అందించడం జరిగిందని వీడియోలో అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. ఇంకా వైయస్ సునీత సిబిఐ విచారణలో… ఒక్కోసారి ఒక్కో రకంగా మాట్లాడుతుందని చెప్పుకొచ్చారు.

MP YS Avinash Reddy Vs YS Sharmila on YS Viveka Case

MP YS Avinash Reddy Vs YS Sharmila on YS Viveka Case

సిట్ దర్యాప్తు చేస్తున్న సమయంలో ఐదు కోణాలలో జరుగుతున్న క్రమంలో తన భర్త పై కేసు ఫోకస్ వెళ్తుండగా… వెంటనే సీబీఐ ఎంక్వేరీ పట్టుబట్టి కేసు డైవర్ట్ చేసి.. ఈ రకంగా సునీత డ్రామాలాడుతుందని ఎంపీ అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే వైయస్ వివేకానంద రెడ్డిని ఆస్తుల కోసం హత్య చేయలేదని షర్మిల అన్నారు. మొదటినుండి ఆస్తులు సునీత పేరిట మీదనే ఉన్నాయి. అలాంటప్పుడు వైయస్ సునీతని చంపాలి. ఎందుకంటే వైయస్ వివేకానంద రెడ్డికి ఏకైక కూతురు సునీత. ఆయనకు అరకురా ఆస్తులు అవి కూడా వైయస్ సునీత పిల్లల పేరిట రాయడం జరిగింది.. అంటూ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది