Muggulo Pasupu : ఇంటి ముందు ముగ్గులు పసుపు కుంకుమ వేస్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి…!

Authored By Jyothi Marikanti | The Telugu News | Published on: December 13, 2023, 12:00 pm
  •  Muggulo Pasupu : ఇంటి ముందు ముగ్గులు పసుపు కుంకుమ వేస్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి...!

Muggulo Pasupu : ఇంటి ముందు వేసే ముగ్గులో పసుపు కుంకుమ వేయవచ్చా..? ఒకవేళ వేస్తే ఎటువంటివి జరుగుతాయి. అసలు వేయొచ్చా.. లేదా.. అనే విశేషాలు ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకుందాం.. ముగ్గులు లేదా రంగవల్లులు రంగులతో వేస్తే వెయ్యొచ్చు.. కానీ ముగ్గులు మాత్రం వేయడం మన భారతీయ సంప్రదాయం ముగ్గుతో వేసినవి కనుక ముగ్గులు అన్నారు. ముగ్గులు వేయడానికి ఉపయోగపడే చూర్ణం అంటే ఆ పొడి ముగ్గును దానిని ముగ్గు అన్నారో తెలియదు కానీ.. ఈ రెండిటికి మాత్రం అది నా భావ సంబంధం ఉంది అని కూడా అంటారు. ముగ్గులను రెండు కలిపిన మిశ్రమంతో కూడా వేసేటటువంటి పద్ధతి ఉంది. ఇంట్లో తులసి కోట దగ్గర పసుపు రాసిన గుమ్మాలు ఈ విధంగా పిండితోనే వేయడం సంప్రదాయంగా వస్తుంది. అయితే ఇంటి బయట పెరట్లో ఇంకా ఇతర ప్రదేశాలలో వేసే ముగ్గులు ముగ్గుతో వేయడం అలవాటు.. అయితే వీధుల్లో చెత్తచెదారం పేరుకుపోయి మురికి దోమలు ఇంకా నుసములు ఇలాంటివి వ్యాపించకుండా ఉండేందుకు గ్రామపంచాయతీ వారు గాని మున్సిపాలిటీ వాళ్లు గానీ మురికివాడలలో గుళ్ళ ముగ్గు చల్లడం కూడా అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఈ గుల్ల ముగ్గు అనేది చాలా ఘాటుగా ఉంటుంది.

ఎన్నో రకాలైన సూక్ష్మజీవులు దాని ఘాటుకి మరణిస్తాయి. అయితే ధనుర్మాస మాసంలో వేసేటటువంటి గుమ్మడి పండు,ముగ్గు వరి కంకులు ఆ సమయంలో వచ్చే పంటలను గుర్తుచేస్తాయి. ఇక మళ్లీ పందిరి ఉయ్యాల మంచం ఈ విధంగా ఎన్నో రకాల సృజనాత్మకత ఈ ముగ్గులలో దాగి ఉంది. మరి అటువంటి ఈ ముగ్గులలో ముఖ్యంగా ఇంటి ముందు వేసేటటువంటి ఈ ముగ్గులలో పసుపు, కుంకుమ వేస్తూ ఉంటారు. చాలామంది మరి ఈ విధంగా ఇంటి ముందు వేసే ముగ్గులు పసుపు, కుంకుమ వేయవచ్చా అంటే.. నూటికి నూరు శాతం వేయకూడదు.. ఎందుకంటే పసుపు కుంకుమను మనం ఎన్నో శుభకార్యాలలో ఉపయోగిస్తూ ఉంటాం.

అలాంటి పసుపు కుంకుమ కచ్చితంగా వీధిలో వేయడం వల్ల వాటిని ఎంతోమంది తొక్కుతూ ఉంటారు.. అలా తొక్కిన కూడా అది అశుభమే కనుక కచ్చితంగా పసుపు కుంకుమను ఇంటి ముందు వేసే గుమ్మంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు.. ఇక అదే విధంగా పసుపును కుంకుమను ఎక్కువగా మనం ఇంట్లో వేసుకునే ముగ్గులు అంటే భగవంతుడికి ఎదురుగుండా పిండి బియ్యం వేస్తాం కదండీ పిండి బియ్యంతో అలా పిండి బియ్యంతో వేసేటటువంటి ముగ్గులు పసుపు కుంకాన్ని అలంకరించుకోవచ్చు.. అలాగే పూలు కూడా పెట్టుకోవచ్చు. కానీ బయట అంటే వీధిలో వేసేటటువంటి ముగ్గులు పసుపు, కుంకుమను అస్సలు వాడకూడదు…

Jyothi Marikanti

No bio available for this author.

  1. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  2. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

  3. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  4. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

  5. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

  6. "Medha Heroine : టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వ‌నున్న స్టార్ హీరో కుమార్తె .. ఫస్ట్‌ లుక్ అదుర్స్‌..!"

  7. "Pawan Kalyan : స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యతపై పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్.. పొత్తులో తేడా వస్తే అంతే సంగతులా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp