Mutton Bone Soup Recipe : మటన్ బోన్ సూప్ రెసిపీ.. ఎముకలలో బలానికి బలం.. రుచికి రుచి.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mutton Bone Soup Recipe : మటన్ బోన్ సూప్ రెసిపీ.. ఎముకలలో బలానికి బలం.. రుచికి రుచి..

 Authored By prabhas | The Telugu News | Updated on :27 July 2022,1:30 pm

Mutton Bone Soup Recipe : నాన్ వెజ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వారి వరకు అందరూ నాన్వెజ్ ను చాలా ఇష్టంగా తింటుంటారు. కొంతమంది ఎముకల లో బలం లేకుండా పోతుంది. అలాగే ఎముకల గుజ్జు కూడా అరిగిపోతుంది ఇలాంటి వారికి ఒక గొప్ప సూప్ తయారుచేసి తాగిద్దాం.. అయితే ఈ సూప్ పేరు మటన్ బోన్ సూప్.. ఈ సూప్ తాగితే ఎముకలలో బలం అలాగే గుజ్జు కూడా వస్తుంది. అయితే దీని తయారీ విధానం ఎలాగో చూద్దాం..దీనికి కావలసిన పదార్థాలు: 1) మటన్ బోన్స్ 2) పచ్చిమిర్చి 3) అల్లం వెల్లుల్లి 4) కారం 5) ఉప్పు 6) కొత్తిమీర 7) ధనియాలు 8) మిరియాలు 9) జీలకర్ర 10) బిర్యానీ ఆకు 11) పసుపు 12)ఉల్లిపాయలు 13)నూనె 14)నెయ్యి15( జొన్నపిండి 16)నిమ్మరసం మొదలైనవి..

దీని తయారీ విధానం అరకిలో మటన్ బోన్స్ ను తీసుకొని ఒక వాటిని ఆకుక్కర్ లో వేసి దానిలో కొంచెం ఉప్పు వేసి ఒక పది నిమిషాలు పొంగు వచ్చేలా ఉడకనివ్వాలి. ఇలా వచ్చిన పొంగును తీసి పక్కన పడేసుకోవాలి. తరువాత దానిలో అల్లం, వెల్లుల్లి ,పచ్చిమిర్చి వీటిని కచ్చాపచ్చాగా దంచుకొని దాంట్లో వేయాలి. తరువాత కొత్తిమీర కాడలు, కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాలు, కొంచెం పసుపు, రెండు యాలకులు, ఒక దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, కొంచెం ధనియాలు వేసి కుక్కర్ కి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడకనివ్వాలి. తర్వాత దాని మూత తీసి దానిలో మళ్లీ ఒక లీడర్ నీళ్లను పోసుకొని సన్నని మంటపై బాగా ఉడకనివ్వాలి.

Mutton Bone Soup Recipe in telugu

Mutton Bone Soup Recipe in telugu

తర్వాత దానిని దింపి పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీ తీసుకొని దాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని, సన్నని అల్లం ముక్కలు, సన్నని వెల్లుల్లి ముక్కలు, సన్నని పచ్చిమిర్చి, కొంచెం కారం, కొంచెం పసుపు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న సూప్ ను దీంట్లో పోసుకోవాలి. తరువాత ఒక పది నిమిషాల వరకు ఉడకనిచ్చి, దానిలో కొత్తిమీర కొంచెం ధనియా పౌడర్ వేసుకొని దింపుకోవాలి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన బోన్ సూప్ రెడీ. ఇది ఎముకలలో బలానికి బలం రుచికి రుచి,

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది