Mutton Pulao Recipe : సరికొత్త స్టైల్ లో మటన్ పులావ్.. రుచి అదిరిపోద్ది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mutton Pulao Recipe : సరికొత్త స్టైల్ లో మటన్ పులావ్.. రుచి అదిరిపోద్ది…!

Mutton Pulao Recipe : మటన్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. మాంసకృత్తులు ఎక్కువ కలిగిన మటన్ తినడం వలన శరీరం గట్టిపడుతుంది. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండాలంటే అప్పుడప్పుడు మాంసాహారాన్ని తినాలి. అయితే ఎప్పుడు చేసుకునే స్టైల్ లో కాకుండా సరికొత్త స్టైల్ మటన్ ని పులావ్ లాగా చేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అసలు వదిలి పెట్టకుండా తినేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం మటన్ పులావ్ ని ఎలా తయారు చేసుకోవాలి, దానికి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :9 October 2022,4:00 pm

Mutton Pulao Recipe : మటన్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. మాంసకృత్తులు ఎక్కువ కలిగిన మటన్ తినడం వలన శరీరం గట్టిపడుతుంది. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండాలంటే అప్పుడప్పుడు మాంసాహారాన్ని తినాలి. అయితే ఎప్పుడు చేసుకునే స్టైల్ లో కాకుండా సరికొత్త స్టైల్ మటన్ ని పులావ్ లాగా చేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అసలు వదిలి పెట్టకుండా తినేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం మటన్ పులావ్ ని ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: 1) బాస్మతి రైస్ 2) మటన్ 3) ధనియాల పొడి 4) గరం మసాలా 5) ఆయిల్ 6);పచ్చిమిర్చి 7) ఉల్లిపాయ 8) కొత్తిమీర 9) పుదీనా

తయారీ విధానం: ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో రెండున్నర గ్లాసుల బాస్మతి రైస్ తీసుకోవాలి. మటన్ ఒకసారి బాగా కడిగే ఒక బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో వంటి స్పూన్ వరకే అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు, పావు టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, తర్వాత 3 టీ స్పూన్ల పెరుగు సన్నగా కట్ చేసుకున్న పుదీనా, కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలపాలి. పక్కన పెట్టేసి ఒక గంటపాటు మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ మిరియాలు, ఏడు ఎనిమిది పచ్చిమిర్చి, రెండు అంగుళాల అల్లం ముక్కలు, వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్లో ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ తీసుకోవాలి. ఒక గ్లాసు నీళ్లు పోసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.

mutton pulao recipe in telugu

mutton pulao recipe in telugu

తరువాత మటన్ ముక్కలతో సహా ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు అదే కుక్కర్లో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసి నాలుగు లవంగాలు దాల్చిన చెక్క అర టీ స్పూన్ సాజీర, ఒక బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా పుదీనా వేసి కలుపుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ను వేసి కలుపుకోవాలి. ఇందులో టమాటా ముక్కలు వేసి కొద్దిగా మగ్గాక కొద్దిగా జీర పౌడర్ వేసి కొద్దిగా పెరుగు వేసి కలుపుకొని ముందుగా వేయించుకున్న మటన్ ముక్కలు వేసి కొద్దిగా ఉడికించుకొని ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి కలుపుకొని మంటను లో ఫ్లేమ్ లో ఉంచి కొద్దిసేపు ఉడికించుకోవాలి. మూడు గ్లాసుల నీళ్లు పోసుకుని కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కుక్కర్ పై మూత పెట్టుకొన ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన మటన్ పులావ్ రెడీ అయిపోయింది.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది