Nadendla Manohar : చంద్రబాబు పై కోపంగా ఉన్న నాదెండ్ల మనోహర్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nadendla Manohar : చంద్రబాబు పై కోపంగా ఉన్న నాదెండ్ల మనోహర్..!

 Authored By aruna | The Telugu News | Updated on :20 January 2024,3:00 pm

Nadendla Manohar : ఏపీలో మరో 80 రోజుల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక పొత్తు అన్నాక అంతర్గత విభేదాలు వచ్చే అవకాశం కచ్చితంగా ఉంటుంది. వచ్చిన సమస్యలను పొత్తు పార్టీకి సొంత పార్టీ కి నష్టం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధినేతపై ఉంటుంది. ఇక సీట్ల విషయంలో జనసేన, టీడీపీ మధ్య పరిస్థితి వేరేలా ఉంటుంది. 2019లో తెనాలిలో ఆళ్లపాటి రాజా 70వేల ఓట్లు సాధించి ఓడిపోయారు. అదే ప్రాంతంలో నాదెండ్ల మనోహర్ జనసేన నుంచి పోటీ చేసి 30 వేల ఓట్లు సాధించి ఓడిపోయారు. అన్నా బత్తుల శివకుమార్ ఆ ప్రాంతంలో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇప్పుడు శివ కుమార్ ను ఓడించాలంటే టీడీపీ, జనసేన నుంచి ఒక్కరు మాత్రమే పోటీ చేయాలి.

అయితే నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచే పోటీ చేస్తానని పట్టుబట్టారు. ఇక ఆళ్లపాటి రాజా కూడా టీడీపీ నుంచి తనకు కచ్చితంగా తెనాలిలో సీటు కావాలని పట్టుబట్టారు. సీటు ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని తెల్చి చెప్పారు. ఒకవేళ చంద్రబాబు నాదెండ్ల మనోహర్ కు టికెట్ ఇస్తే తెనాలిలో ఆళ్లపాటి రాజా హవా, పవర్ తగ్గుతుంది. మళ్లీ ఆయన సాధించుకునే పరిస్థితి ఉండదు. అందుకే ఈ అంశంలో ఆళ్లపాటి రాజా సీరియస్ గా ఉన్నారని, ఇండిపెండెంట్గా నైనా పోటీ చేసి ఓట్లు చీల్చడానికైనా రెడీగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నాదెండ్ల మనోహర్ కి సీటు ఇస్తే ఒప్పుకోనని ఆళ్లపాటి రాజా సీరియస్గా చెప్పారు. ఇక మెతక స్వభావం అయినా నాదెండ్ల మనోహర్ ఇలాంటి తలనొప్పులు నాకు వద్దు అని జనసేనకి రాజీనామా చేస్తానని, పోటీ చేస్తే తెనాలి నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ కి తేల్చి చెప్పారట.

జనసేన కి ముఖ్య నాయకుడు లో నాదెండ్ల మనోహర్ ఒకరు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ని వదులుకోరు. కానీ చంద్రబాబు నాయుడు ఆళ్ళపాటి రాజా వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో నాదెండ్ల మనోహర్ చంద్రబాబు నాయుడు పై సీరియస్ గా ఉన్నారు. తెనాలి నుంచే పోటీ చేస్తానని లేదంటే జనసేన కి రాజీనామా అయినా చేస్తానని నాదెండ్ల మనోహర్ పట్టు బట్టారు. దీంతో తెనాలి సీటు విషయంలో టీడీపీ కి జనసేన కి పెద్ద తలనొప్పిగా మారింది. సీట్ల విషయంలో టీడీపీ, జనసేన కి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సీట్ల విషయంలో ఎలా సర్దుకుంటారో చూడాలి. మరోవైపు వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను ఎంపీలను ప్రకటిస్తూ నాలుగు జాబితాలను విడుదల చేశారు ఇప్పటి వరకు కూటమిగా ఏర్పడిన జనసేన, టీడీపీ తొలి జాబితా విడుదల కాలేదు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది