Exit Polls : ఏంటి.. ఎగ్జిట్ పోల్స్‌ని కొనేస్తున్నారా.. అంత అవ‌స‌రం ఏమోచ్చింది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Exit Polls : ఏంటి.. ఎగ్జిట్ పోల్స్‌ని కొనేస్తున్నారా.. అంత అవ‌స‌రం ఏమోచ్చింది..!

 Authored By ramu | The Telugu News | Updated on :2 June 2024,1:39 pm

ప్రధానాంశాలు:

  •  Exit Polls : ఏంటి.. ఎగ్జిట్ పోల్స్‌ని కొనేస్తున్నారా.. అంత అవ‌స‌రం ఏమోచ్చింది..!

Exit Polls : జూన్ 1 వ‌ర‌కు దేశంలోని ప‌లు ప్రాంతాల‌లో ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. జూన్4న ఫ‌లితాలు బ‌య‌టకి రానుండ‌గా, ఏ పార్టీ విజ‌యం సాధిస్తుంది, ఏ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుంద‌నే దానిపై లెక్క‌లు వేసుకుంటున్నారు. ఏప్రిల్ 19వ తేదీ నుంచి మొదలుకొని జూన్ 1వ తేదీ వరకు.. వారం రోజుల గ్యాప్ చొప్పున ఏడు దశల్లో పోలింగ్ సాగింది. తాజాగా ఎగ్జిట్ పోల్స్ బ‌య‌ట‌కు రాగా, ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలతో దాదాపు ఎవరు విజయం సాధిస్తారనేది తేలుతుంది. వాస్తవ ఫలితాలకు, ఎగ్జిట్ పోల్స్‌కి చాలా తేడా ఉంటుంది. కానీ.. ఎవరిది పైచేయి ఉంటుందనే విషయం మాత్రం ఎగ్జిట్ పోల్స్‌తో దాదాపు తేలిపోతుంది.

Exit Polls ఉప‌యోగం ఏంటి ?

ఎన్నికల ఫలితాలను అంచనా వేసేందుకు.. ఓటర్లు ఓటు వేసిన వెంటనే వారిని ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఓటర్లు ఇచ్చే సమాచారం ఆధారంగా.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది అంచనా వేస్తారు. దీనినే ఎగ్జిట్ పోల్స్ అంటారు. నిజానికి.. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో.. ఈ ఎగ్జిట్ పోల్స్‌ని కేంద్ర ఎన్నికల సంఘం నిషేధించింది. ఓటర్లపై ప్రభావం చూపకుండా ఉండేందుకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన 30 నిమిషాల తర్వాత ఎగ్జిట్ పోల్స్‌ని రిలీజ్ చేయవచ్చు. ఎల‌క్ష‌న్స్ జ‌రిగిన ప్ర‌తిసారి కూడా ఎగ్జిట్ పోల్స్ విడుద‌ల అవుతుంటాయి. అయితే తాజాగా ఎగ్జిట్ పోల్స్ విడుద‌లైన నేప‌థ్యంలో కొత్త చ‌ర్చ న‌డుస్తుంది. పెయిడ్ ఎగ్జిట్ పోల్స్ ఈసారి వెల్లడయ్యాయని మాట వినిపిస్తోంది. అందుకు కార‌ణం ఎగ్జిట్ పోల్స్‌లో క‌నిపిస్తున్న వైరుధ్యం.

Exit Polls ఏంటి ఎగ్జిట్ పోల్స్‌ని కొనేస్తున్నారా అంత అవ‌స‌రం ఏమోచ్చింది

Exit Polls : ఏంటి.. ఎగ్జిట్ పోల్స్‌ని కొనేస్తున్నారా.. అంత అవ‌స‌రం ఏమోచ్చింది..!

మ‌రో రెండు రోజుల్లో రిజ‌ల్ట్స్ బయటకు రానున్న వేళ.. పెయిడ్ ఎగ్జిట్ పోల్స్ అవసరమేంటి? అన్నది ప్రశ్నగా మారింది. పెయిడ్ ఎగ్జిట్ పోల్స్ కాన్సెప్టు ఎందుకు షురూ అయ్యిందన్న ప్రశ్నకు కొందరు బదులిస్తూ.. ఎగ్జిట్ పోల్స్ తో తాము సమర్థించే పార్టీ క్యాడర్ కు మనోధైర్యాన్ని కల్పించటం.. కీలకమైన ఓట్ల లెక్కింపు వేళ.. కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే వారు మరింత ఆత్మవిశ్వాసంతో వ్యవహరించేందుకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు టానిక్ మాదిరి పని చేస్తాయ‌ని కొంద‌రు చెప్పుకొస్తున్న మాట‌. కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే క్యాడర్ లో ధైర్యం నింపేందుకు వీలుగా ఈ మైండ్ గేమ్ కు తెర తీసినట్లుగా చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ తప్పు అయితే నిలదీయటం ఉండదు. కాబ‌ట్టి ఎవ‌రు ఏది చెప్పిన న‌డుస్తుంది అనేలా ఈ పోల్స్ రిలీజ్ చేశారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది