TDP : 1984, 1994,చ 2014, 2024.. ఛ.. పోస్టులో అసలు విషయం మర్చిపోయారే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TDP : 1984, 1994,చ 2014, 2024.. ఛ.. పోస్టులో అసలు విషయం మర్చిపోయారే..!

 Authored By ramu | The Telugu News | Updated on :2 June 2024,8:20 pm

ప్రధానాంశాలు:

  •  TDP : 1984, 1994,చ 2014, 2024.. ఛ.. పోస్టులో అసలు విషయం మర్చిపోయారే..!

TDP : ఒకప్పుడు మీడియాకు ఉన్న క్రెడిబిలిటీ వేరు. అందులో దాదాపు నిజాలే ప్రసారం అయ్యేవి. ఏపార్టీకి ఏ ఛానెల్, పత్రిక కొమ్ముకాసినా సరే నిజాలను నిజాలుగానే చెప్పేవారు. అందుకే మెయిన్ స్ట్రీమ్ మీడియాకు అంత ప్రాధాన్యత ఉండేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత నిజాల కంటే ముందే అబద్దాలు త్వరగా ప్రచారం అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే నిజాల కన్నా అబద్దాలే బలంగా దూసుకెళ్తున్నాయి. దాంతో ప్రజలు కూడా వాటినే నమ్మే పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు ఏపీలో అధికారం ఎవరిది అంటే ఎవరికి వారే ఇలాంటి అబద్దాలనే రంగులు వేసి చూపిస్తున్నారు.

TDP సంబరాల్లో టీడీపీ..

ఏ పార్టీ ఎన్ని విధాలుగా ప్రచారాలు చేసి పోరాడినా.. చివరకు ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఏం చెప్పాలో అవి పార్టీల ముందు, ప్రజల ముందు ఉంచేశాయి. అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ ను కూడా పార్టీలు తమకు అనుకూలంగా ప్రచారాలు చేసుకుంటున్నాయి. వాటిలో తోతును వెతికి మరీ తమదే అధికారం అని చూపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. దాని సారాంశం ఏమంటే.. 1984, 1994,చ 2014, 2024 టీడీపీ గెలుపు అంటూ.. ఇది చూసిన టీడీపీ కూటమి నేతలు, కార్యకర్తలు తెగ సంబురపడిపోవాల్సిందే అన్నట్టు ఉంది.

TDP 1984 1994చ 2014 2024 ఛ పోస్టులో అసలు విషయం మర్చిపోయారే

TDP : 1984, 1994,చ 2014, 2024.. ఛ.. పోస్టులో అసలు విషయం మర్చిపోయారే..!

ఎందుకంటే చివర 4 నెంబర్ వచ్చిన ప్రతి ఎన్నికల్లో టీడీపీనే గెలిచిందని.. ఇప్పుడు కూడా కూటమిదే అధికారం అని చెబుతున్నారన్నమాట. అయితే ఇక్కడ ఓ విషయం మర్చిపోయినట్టున్నారు. అదేంటంటే ఈ పోస్టులో 2004ను ప్రస్తావించలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో 2004లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఏపీలో అధికారంలోకి వచ్చింది. మరి దాంట్లో కూడా చివర 4 నెంబర్ ఉంది కదా. అప్పుడు టీడీపీకి అధికారం దక్కలేదు. కానీ ఈ విషయాన్ని కప్పి పుచ్చేసి టీడీపీ నేతలను సంతృప్తి పరచడానికి ఈ పోస్టును ఎల్లో కలర్ వేసి రెడీ చేశారు.ఇది గమనిస్తే ఎవరికైనా ఏం తెలివిరా బాబు అనిపించకమానదేమో. మరి 2004 సీన్ రిపీట్ అవుతుందా.. లేదంటే 2014 సీన్ రిపీట్ అవుతుందా అనేది రెండు రోజులు ఆగితే తేలిపోతుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది