Nandamuri Family : బాబు ట్రాప్‌లో నందమూరి ఫ్యామిలీ పడిపోయిందా..?
Nandamuri Family : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ హుందాగా కనిపించేవారు. కానీ, ఇటీవల ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనల నేపథ్యంలో తొలిసారి మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. తన భార్యను కించపరిచారని వెక్కి వెక్కి ఏడ్చారు. సీఎం అయ్యాకే తాను అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశాడు. ఈ క్రమంలోనే చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి నందమూరి కుటుంబ సభ్యులు మద్దతు ఇస్తున్నారు.తన భార్యను కించ పరిచారంటూ చంద్రబాబు భావోద్వేగానికి గురై ఏడ్చిన ఘటనను చూసి పలువురు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి కుటుంబ సభ్యులు..సీనియర్ ఎన్టీఆర్ కూతుర్లు, కుమారులు చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు.
Nandamuri Family : బాబు నిర్ణయం సరైనదే..!
నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ, కూతుర్లు లోకేశ్వరి చంద్రబాబుకు మద్దతు తెలిపారు. వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై చంద్రబాబు ఆపినా తాము ఆగామని వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ కూతురు, బీజేపీ మహిళా నాయకురాలు పురందేశ్వరి సైతం వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చింది. తాము క్రమశిక్షణతో, విలువలతో పెరిగామని చెప్పుకొచ్చింది. మొత్తంగా నారా భువనేశ్వరి నందమూరి కుటుంబసభ్యులు అండగా నిలుస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం తన మేనత్తకు అండగా నిలిచారు. వైసీపీ నేతలు హద్దుల్లో ఉండాలని చెప్పారు. నిజానికి నందమూరి కుటుంబ సభ్యులు అందరూ కూడా రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. సీనియర్ ఎన్టీఆర్ మరణం తర్వాతే బాలకృష్ణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు.
మొత్తంగా చంద్రబాబు నాయకత్వాన్ని నందమూరి కుటుంబసభ్యులు మరోసారి బలపరుస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. నిజానికి 2019 సాధారణ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత జరిగిన ఎన్నకల్లోనూ ఓటమి పాలవుతూనే వస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు అవసరం ఉందని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. చాలా సార్లు చంద్రబాబు ఎదుట జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. అయితే, తారక్ ప్రస్తుతం సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. కానీ, తాజా ఘటనతో స్పందించి ప్రకటన చేయడం ద్వారా టీడీపీకి కొంచెం మేలే జరినట్లయింది. మొత్తంగా భవిష్యత్తులో చంద్రబాబుకు గెలుపు సంకేతాలు కనబడే పరిస్థిలు ఉన్నాయని కొందరు అంచనా వేస్తున్నారు.