Balakrishna : సూది బెజ్జమంత సందిస్తే చెవిలో.. పోస్తారు.. కంట్రోల్ తప్పిన బాలయ్య

Authored By Cinema Desk | The Telugu News | Updated on: January 19, 2021, 12:29 pm

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణకు మైక్ కనిపిస్తే చాలు ఎలా ఊగిపోతాడో అందరికీ తెలిసిందే. బాలయ్యకు మైకు అందింతే.. ట్రోల్స్, మీమ్స్ క్రియేట్ చేసేవాళ్లకు బోలెడంత స్టఫ్ దొరికినట్టే. నేడు స్వర్గీయ ఎన్టీఆర్ 25వ వర్దంతి. ఈసందర్భంగా బాలయ్య తన అన్న రామకృష్ణ, అభిమానులు, కార్యకర్తలతో సహా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. ఇది ప్రతీ ఏడాది జరుగుతూ వచ్చే వ్యవహారమే. అయితే అలా బాలయ్య వెళ్లిన ప్రతీ సారి మీడియాతో ఏదో ఒకటి మాట్లాడటం అది వైరల్ అవుతుందని అందరికీ తెలిసిందే.

Nandamuri Balakrishna at NTR 25th death anniversary

Nandamuri Balakrishna at NTR 25th death anniversary

అయితే ఈ సారి మాత్రం ఏకంగా మీడియానే బూతులు తిట్టేశాడు. అది కాస్తా ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. బాలయ్య తన నోటికి ఎంతొస్తే అంతలా మాట్లాడేశాడు. తనదైన శైలిలో సామెతలు చెబుతూ మీడియాను ఏకి పారేశాడు. మొత్తంగా మీడియాలో ఎన్టీయార్ గురించి మాట్లాడిన మాటల కంటే.. మీడియానే తిట్టిన వీడియో, ఆ మాటలు వైరల్ అవుతున్నాయి. ఒక సారి కాదు రెండు మూడు సార్లు మీడియాపై బాలయ్య మండిపడ్డాడు.

మైకు పెట్టు.. మైకు పెట్టు.. అని రిపోర్టర్లు అంటుంటే.. మైకు పెట్టు కాదురా.. మైకు పట్టుకో అనాలిరా అంటూ కాస్త పరుషంగా మాట్లాడాడు. కొంచెం ముందుకు రండి.. కొంచెం వెనక్కి రండి అంటూ కెమెరామెన్‌లు తమ పొజిషన్‌లను చూసుకుంటూ బాలయ్యను అటు ఇటూ జరగమన్నారు. చాల్ చాల్లే.. మీకు సూది బెజ్జమంత సందిస్తే చెవిలో ఉచ్చ పోస్తారు అంటూ దారుణంగా మాట్లాడేశాడు. ప్రస్తుతం ఈ క్లిప్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp