Nara Lokesh : తండ్రిని మించిన డబ్బా రాయుడు.. లోకేష్ అడ్డంగా దొరికాడు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nara Lokesh : తండ్రిని మించిన డబ్బా రాయుడు.. లోకేష్ అడ్డంగా దొరికాడు..!

 Authored By kranthi | The Telugu News | Updated on :1 March 2023,1:00 pm

Nara Lokesh : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురించి తెలుసు కదా. ప్రపంచంలో ఏం జరిగినా అది మా వల్లనే అంటారు. కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్నది కూడా తానే అంటూ చంద్రబాబు ఈ మధ్య చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ను నేనే డెవలప్ చేశా. హైదరాబాద్ కు ఐటీ తెచ్చా. అమరావతి రాజధానిని తెచ్చా.. ఇలా అన్నీ నావల్లనే అంటూ చెప్పుకుంటారు చంద్రబాబు. ఇప్పుడు ఆయన సుపుత్రుడు నారా లోకేశ్ కూడా అదే బాపతు అని స్పష్టంగా అర్థం అయింది.

Nara Lokesh padayatra yuvagalam in ap

Nara Lokesh padayatra yuvagalam in ap

ప్రస్తుతం నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఆయన యువగళం పాదయాత్ర జనవరిలో ప్రారంభం అయింది. ఇక అప్పటి నుంచి ప్రజల మధ్య తిరుగుతూ తన హీరోయిజాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రజలను ఇప్పుడు జగన్ పట్టించుకుంటున్నారంటే దానికి కారణం నేనే. నా పాదయాత్ర ప్రభావమే అనే రేంజ్ లో లోకేశ్ అవకాలు చెవాకులు పేలుతున్నారు. సీఎం జగన్ ఇటీవల పల్లెల్లో నిద్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి.. ఇలా పల్లెల్లో నిద్రించడం అనేది ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదు.

Nara Lokesh padayatra yuvagalam in ap

Nara Lokesh padayatra yuvagalam in ap

Nara Lokesh : నన్ను చూసి భయపడి పల్లెల్లో నిద్ర కార్యక్రమం

దానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టడంతో అదంతా నన్ను చూసి జడుసుకొని సీఎం జగన్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు అనే రేంజ్ లో నారా లోకేశ్ తన పాదయాత్రలో చెప్పుకొస్తున్నారు. ఇన్నేళ్లు లేని పల్లెల్లో నిద్ర కార్యక్రమం ఇప్పుడే ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు. ఇన్నాళ్లు తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉన్న జగన్ ఇప్పుడు అక్కడి నుంచి బయటికొచ్చి ప్రజల వద్దకు వెళ్తున్నారు. దానికి కారణం.. నా పాదయాత్రను చూసి సీఎం జడుసుకోవడమే అని జబ్బలు చరుచుకుంటున్నారు నారా లోకేశ్. చూద్దాం.. ఇంకా భవిష్యత్తులో ఇంకేం చెబుతారో నారా లోకేశ్.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది