Nara Lokesh : ఎన్నికలు దగ్గర పడుతున్నా చినబాబు పోటీపై క్లారిటీ ఏది?
Nara Lokesh : 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరి నియోజక వర్గం నుండి పోటీ చేసిన విషయం తెల్సిందే. ఆ స్థానంలో వైకాపా ఘన విజయం సాధించడంతో నారా లోకేష్ కు ఘోర పరాభవం తప్పలేదు. అమరావతి ని అభివృద్ది చేస్తాం.. అద్బుతంగా మార్చేస్తాం అంటూ చంద్రబాబు నాయుడు హామీలు ఇవ్వడంతో ఆ ప్రాంతం నియోజక వర్గం అయిన మంగళగిరి లో లోకేష్ విజయం తద్యం అని అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా మొత్తం ప్లాన్ రివర్స్ అయ్యింది.ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు ఘోర పరాభవం ఎదురయ్యింది. జగన్ కు అద్బుత విజయం దక్కింది. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.
మరో రెండేళ్లలో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ముందస్తు ఎన్నికలు అంటూ కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంత హడావుడిలో ఇప్పటి వరకు నారా లోకేష్ తదుపరి ఎన్నికల్లో ఎక్కడ నుండి పోటీ చేయాలి అనే విషయం లో ఒక క్లారిటీకి రాలేక పోతున్నాడు. మంగళగిరిలో మళ్లీ పోటీ చేసి పరాభవం మూట కట్టుకోవాలని ఆయన కోరుకోవడం లేదట.తెలుగు దేశం పార్టీకి కాస్త గౌరవం.. ఇంకా బలం ఉన్న చోట పోటీ చేయాలని లోకేష్ భావిస్తున్నాడ. అందుకోసం ఇటీవల శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంకు వెళ్లాడట. అక్కడ ఉన్న పరిస్థితులను గమనించి పోటీ చేసే విషయమై తుది నిర్ణయం తీసుకోవాలనుకుంఉటన్నాడు.
గత ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో దారుణమైన పరాజయం పాలయినా కూడా శ్రీకాకుళంలో మాత్రం ఒక గౌరవ ప్రథమైన ఓట్లు సీట్లు వచ్చాయి. దాంతో శ్రీకాకుళం లోనే పోటీ చేయాలని లోకేష్ భావిస్తున్నాడు అనే వార్తలు వచ్చాయి. ఆ ఒక్కటే కాకుండా రెండు మూడు చోట్ల కూడా లోకేష్ పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నా కూడా ఇప్పటి వరకు లోకేష్ ఆ నియోజక వర్గంలో ఎక్కడ పోటీ చేయాలో పాలు పోక జుట్టు పీక్కుంటున్నాడు.