
nara lokesh want to see bheemla nayak
Nara Lokesh : పవన్, రానా కాంబినేషన్‌లో రూపొందిన భీమ్లా నాయక్ చిత్రం ప్రస్తుతం థియేటర్ లో తెగ రచ్చ చేస్తుంది. ఈ సినిమా కోసం అభిమానులు గత రాత్రి నుండే థియేటర్స్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు.తెలంగాణలో చిత్రం బెనిఫిట్ షో వేయగా, ఈ సినిమా చూసేందుకు ఏపీ నుండి అభిమానులు ఇక్కడికి వచ్చారు. పలు థియేటర్ల వద్ద డప్పు వాయిద్యాలతో సందడి చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే టిక్కెట్లు అమ్మాలంటూ అధికారుల ఆదేశాలివ్వడంతో.. ఆయా థియేటర్స్ వద్ద పోలీసుల్ని మోహరింపచేశారు. పవన్ సినిమాలపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జనసేన నాయకులు మాత్రమే కాదు ఇతర పార్టీవాళ్లు కూడా జగన్ వైఖరిని దుయ్యబడుతున్నారు.తాజాగా టిడిపి నేత నారా లోకేష్ కూడా భీమ్లా నాయక్ సినిమాని సపోర్ట్ చేస్తూ, ఏపీ ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. ” భీమ్లా నాయక్ సినిమాకి అద్భుతమైన స్పందన వస్తోంది. నేను కూడా సినిమాని చూడాలని ఎదురు చూస్తున్నాను. వైఎస్ జగన్ ఒక పరిశ్రమ తర్వాత మరో పరిశ్రమను నాశనం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ని భిక్షాటన చేసే గిన్నెగా మారుస్తున్నారు. భీమ్లా నాయక్ సినిమా ఇలాంటి కుట్రలను అధిగమించి మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను ” అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.
nara lokesh want to see bheemla nayak
ప్రస్తుతం లోకేష్ ట్వీట్ వైరల్‌గా మారింది.ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే భారీగా.. కోట్లాది అభిమానుల కోలాహలం మధ్య భీమ్లా నాయక్ సినిమా విడుదల అయ్యింది. కొన్ని చోట్ల మాత్రం థియేటర్ యాజమాన్యాలు ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాయి. భీమ్లా నాయక్ సినిమాను ప్రదర్శించ లేకపోతున్నందుకు చింతిస్తున్నాం అంటూ బోర్డులు పెట్టారు. ఆయా థియేటర్ల దగ్గర పవన్ అభిమానులు ఆందోళనకు దిగుతున్నారు. ఎంతో ఆశతో సినిమా చూద్దామని వస్తే.. ఇలా షాకిస్తే ఎలా అని మండిపడుతున్నారు. వెంటనే థియేటర్లు ఓపెన్ చేయాలని.. ఈ విషయంలో ప్రభుత్వం కలుగజేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.