nara lokesh will contest from bheemili
nara lokesh : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడి Chandra babu గారి పుత్రరత్నం నారా లోకేష్ బాబు nara lokeshకు జ్ఞానోదయం అయినట్లు కనిపిస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కొట్టిన దెబ్బకి ఆయన దిమ్మ తిరిగి రెండేళ్ల తర్వాత అసలు బొమ్మ కనపడ్డట్లు అర్థమవుతోంది. 2024 శాసన సభ ఎలక్షన్ లోనైనా తాను గెలవాలంటే స్థాన చలనం చేయక తప్పదని గ్రహించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ సెగ్మెంట్ బరిలో నిలిచిన లోకేష్ బాబు nara lokesh.. ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయిన విషయం విధితమే. మంగళగిరిలో లోకేష్ బాబు నెగ్గకపోవటానికి అసలు కారణం అక్కడ తన సామాజికవర్గంవాళ్లు ఎక్కువ శాతం మంది లేకపోవటమేనని ఆయనకు అవగాహన అయిందట. అయితే మూడేళ్ల తర్వాత జరగబోయే ఎలక్షన్ లో మళ్లీ మంగళగిరిలోనే పోటీ చేస్తే మరోసారి ఓటమి తప్పదని లోకేష్ బాబుకి ఇప్పటి నుంచే భయం పట్టుకుందని భావిస్తున్నారు.
nara lokesh will contest from bheemili
టీడీపీకి జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ బాబు అసలే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ లో కాబోయే అధిపతి అని అనుకుంటున్న తరుణంలో రెండోసారి కూడా ఎమ్మెల్యేగా పరాజయం పాలైతే ఎంత నామోషీగా ఉంటుందో ఊహించుకోవచ్చు. కాబట్టి చాలా ముందుగానే కళ్లు తెరిచినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మంగళగిరికి మంగళం పాడి మరో చోట పోటీ చేయాలని చూస్తున్నాడు. ఈసారి కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం నుంచి గానీ విశాఖపట్నం జిల్లాలోని భీమిలి సెగ్మెంట్ నుంచి గానీ పోటీ చేయాలని పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
TDP
లోకేష్ బాబు 2019 ఎన్నికల్లోనే భీమిలిలో పొలిటికల్ కబడ్డీ ఆడాలని ట్రై చేశాడు. కానీ కూతకు దిగకముందే చివరి నిమిషంలోనే ఔట్ అయ్యాడు. మొన్నీమధ్య కరోనాతో చనిపోయిన సబ్బం హరికి అక్కడ టికెట్ ఇవ్వటంతో లోకేష్ బాబు nara lokesh మంగళగిరికి వలస వచ్చాడు. అయినా అక్కడ సబ్బం హరికి గానీ, ఇక్కడ లోకేష్ బాబుకి గానీ కలిసి రాలేదు. సబ్బం హరి లేకపోవటంతో భీమిలి బీచ్ ప్రస్తుతానికి ఖాళీగానే ఉంది. దీంతో దాన్ని ఖాయం చేసుకోవాలని లోకేష్ బాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
Chandra babu
2019లో ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉండే లోకేష్ బాబు ఎమ్మెల్యేగా బరిలోకి నిలిచాడు. ఎమ్మెల్యేగా విక్టరీ కొట్టలేక పెద్దల సభ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. మామూలుగా అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసేవాళ్లు ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ తదితరులు ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పుకొని ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ లోకేష్ nara lokeshకి శాసన సభ ఎన్నికల్లో గెలుస్తాననే నమ్మకం ముందు నుంచీ లేకపోవటం వల్లేమో ఎమ్మెల్సీ పోస్టును అట్టిపెట్టుకున్నాడు. ది గ్రేట్ చంద్రబాబు Chandra babu కొడుకు దొడ్డి దారిన పాలిటిక్స్ లోకి వచ్చాడనే విమర్శను చెరిపేసుకోవాలంటే భీమిలిలో గెలవటానికి ఇప్పటి నుంచే బీ రెడీ అవ్వాలి.
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
This website uses cookies.