chandra babu : చంద్రబాబు నాయుడు ఆ సువర్ణావకాశాన్ని ఎందుకు చేజార్చుకున్నారా..?
Chandra Babu : మొదట ఐఏఎస్ కావాలనుకున్న నారా చంద్రబాబు నాయుడు chandra babu.. తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకొని రాజకీయాల్లోకి వచ్చారు. పాలిటిక్సులో అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకున్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు నెలకొల్పారు. మనం ఏ రంగంలో ఉన్నా ఛాన్సులను చేజిక్కించుకోవాలని, వాటిని సక్రమంగా వాడుకొని పైకి రావాలని చంద్రబాబు నాయుడు chandra babu చెబుతుంటారు. అయితే ఆయన మూడోసారి సీఎం అయ్యాక తనకు అందివచ్చిన ఓ సువర్ణావకాశాన్ని చేజార్జుకున్నారు. అందువల్లే ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజనరీ చీఫ్ మినిస్టర్ గా చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఎందుకు తప్పులో కాలేశారు?.
విశాఖను.. విస్మరించి.. chandra babu
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధాని హైదరాబాద్ ను తెగ డెవలప్ చేశానని ఒకటికి పది సార్లు డబ్బా కొట్టుకుంటున్న చంద్రబాబు నాయుడు.. విశాఖపట్నాన్ని కూడా భాగ్య నగరానికి ధీటుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. వైజాగ్ ఏపీకి ఆర్థిక, పర్యాటక, కల్చరల్ కేపిటల్ అని చంద్రబాబు నాయుడు చెప్పేవారు. ప్రభుత్వ పరిపాలనకు రాజధానిగా ఎదిగే అన్ని సౌకర్యాలూ విశాఖపట్నానికి ఉన్నాయని అంచనా వేశారు. మరి, విశాఖను విభజిత ఆంధ్రప్రదేశ్ కి రాజధానిగా ఎంపిక చేసే సువర్ణావకాశం 2014లో చంద్రబాబు నాయుడికి వచ్చినా ఎందుకు అమలుచేయలేదు?. అమరావతిని తెర మీదికి తెచ్చి అటూ ఇటూ కాకుండా చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పట్టించుకోకపోగా.. అడ్డుపుల్లలు.. : chandra babu
వైజాగ్ ను రాజధాని చేయాలనే డిమాండ్ ఆరు దశాబ్దాల నుంచీ వినిపిస్తోంది. 2014లో రాజధాని ఎంపిక విషయం తెర మీదికి వచ్చినప్పుడు కూడా జనం ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు chandra babuకు గుర్తు చేశారు. అయినా ఆయన పట్టించుకున్న పాపాన పోలేదు. రాజధాని కాగల అన్ని అవకాశాలూ ఉన్న విశాఖపట్నాన్ని వదిలేసి కొత్తగా అమరావతి జపం చేశారు. సరే. జరిగిందేదో జరిగిపోయింది. ఆ పొరపాటును ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరిచేస్తుంటే కోర్టుల్లో కేసులు వేయటం ద్వారా అడ్డుపుల్లలు వేయటం ప్రతిపక్ష నేతగా చంద్రబాబునాయుడికి సమంజసంగా అనిపిస్తోందా?.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఇప్పటికి ఏడేళ్లు. 2014లోనే విశాఖను ఏపీకి రాజధానిగా సెలెక్ట్ చేసుంటే ఇప్పటికే చాలా డెవలప్మెంట్ జరిగేది. తాత్కాలిక రాజధాని నిర్మాణాల పేరుతో అమరావతిలో ఖర్చు చేసిన వేల కోట్ల రూపాయలు వేస్ట్ కాకుండా మిగిలేవి. ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు కాకుండా ఒడ్డునే ఉండేది. ఏపీ రాజధాని విషయంలో ఇప్పటికీ ఒక క్లారిటీ రాకపోవటానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబే ముఖ్య కారణం అని, ఆయన ముందుచూపు ప్రదర్శించకపోవటమే ప్రధాన లోపమని చెప్పొచ్చు.