ysrcp : సీనియర్స్ వర్సెస్ జూనియర్స్.. మ‌ధ్య‌లో న‌లిగిపోతున్న గురుమూర్తి…!

0
Advertisement

ysrcp : ప్రతిపక్ష పార్టీకి పవర్స్ తక్కువ కాబట్టి లీడర్స్ మధ్య డామినేషన్ ప్రాబ్లం పెద్దగా ఉండదు. కానీ అధికార పార్టీ అన్న తర్వాత పెత్తనం కోసం పోటీ పడటం సహజం. సీనియర్స్ కి ఇగో ఫీలింగ్ ఉంటుంది. జూనియర్స్ తమ మాట వినాలని కోరుకుంటారు. కాదని ముందుకు పోవాలంటే ఒత్తిడి తెస్తారు. తమ కంట్రోల్ లో పెట్టుకోవటానికి ట్రై చేస్తారు. తమ గ్రూపులో చేరాలని డిమాండ్ చేస్తారు. ఈ ముఠాలు జిల్లాల వారీగా, కులాల వారీగా ఉంటాయి. హైకమాండ్ కి నిజంగానే క్లోజ్ గా ఉండేవాళ్లు ఒక టీమ్ గా, క్లోజ్ గా ఉంటున్నామని చెప్పుకునేవాళ్లు మరో టీమ్ గా చెలామణి అవుతుంటారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే ఈ కల్చర్ కి పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ కాగా ప్రస్తుతం ఏపీలోని రూలింగ్ పార్టీ వైఎస్సార్సీపీ సైతం దీనికి అతీతం కాదని నిరూపించుకుంటోంది.

groups domination in ysrcp
groups domination in ysrcp

వరుస విజయాలతో మరింత.. ysrcp

అధికారంలో ఉన్నప్పటికీ మధ్య మధ్యలో జరిగే ఉప, స్థానిక సంస్థల ఎన్నికల్లో రూలింగ్ పార్టీకి వరుస విజయాలు వరిస్తుండటంతో ఆధిపత్య పోరు మరింత అధికమవుతోంది. జూనియర్స్ ని తాము చెప్పినట్లు నడుచుకునేలా సీనియర్స్ తమదైన శైలిలో ట్రైనింగ్ ఇస్తున్నారు. 2019 శాసనసభ ఎన్నికల్లో నెగ్గినవారిలో జూనియర్లు ఎక్కువ శాతం ఉన్నారు. కొత్తవాళ్లు కావటంతో మీకు ఏమీ తెలియదు.. కాబట్టి మీరు ఎలా ఉండాలో మేం చెబుతాం.. అంటూ బుట్టలో వేసుకునేందుకు సీనియర్లు పావులు కదుపుతున్నారు. దీంతో సీనియర్స్ చాలా మంది సీనియర్ల వలలో చిక్కుకున్నారు. కొందరు మాత్రం చాకచక్యంగా బయటపడుతున్నారు.

సీనియర్స్ వర్సెస్ జూనియర్స్.. :

ysrcp

groups domination in ysrcp
groups domination in ysrcp

వైఎస్ జగన్ సర్కారులోని ఇద్దరు, ముగ్గురు టూమచ్ గా సీనియారిటీ కార్డు వాడుతున్నారని, ఎమ్మెల్యేలనే కాకుండా ఎంపీలను కూడా తమ చెప్పుచేతల్లో పెట్టుకుంటున్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు చెప్పుకొని హెడ్మాస్టర్ల మాదిరిగా బెత్తం బెదిరింపులకు పాల్పడుతున్నారని టాక్. తొలిసారి శాసన సభ, లోక్ సభ, రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనవాళ్లు ఆయా మినిస్టర్ల గద్దింపులకు మానసికంగా కుంగిపోతున్నట్లు తెలుస్తోంది. సీఎం వైఎస్ జగన్ డైరెక్టుగా బరిలోకి దింపిన డాక్టర్ గురుమూర్తికి సైతం ఈ పొలిటికల్ సిండికేట్ వేధింపులు తప్పట్లేదని తెలుస్తోంది.డాక్టర్ గురుమూర్తి ఇటీవల తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నికలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆయన ఎంపీగా ఇంకా ప్రమాణ స్వీకారమే చేయలేదు. అప్పుడే చిత్తూరు జిల్లాలోని ఇద్దరు సీనియర్ నేతలు తమ పక్షాన ఉండాలంటే తమ పక్షాన ఉండాలంటూ ఆయన్ని బలవంతం చేస్తున్నట్లు సమాచారం. ఏ వర్గానికేం చెప్పాలో తెలియక ఈ డాక్టర్ సాబు దిగులు చెందుతున్నట్లు వినికిడి.

ఇది కూడా చ‌ద‌వండి ==> Ys Jagan : రెండోసారి అధికారంలోకి రావటానికి పక్కా స్కెచ్ రెడీ..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Chiru-Pawan : ఆ సారైనా మ‌ల్టీస్టార‌ర్ హీట్ అవుతుందా..?

ఇది కూడా చ‌ద‌వండి ==> Chandra Babu : చంద్రబాబుకి నాటి సెంటిమెంట్‌ భయం..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Kajal Aggarwal : వేశ్య పాత్రలో కాజల్ అగర్వాల్.. అనుష్కని డామినేట్ చేసే పర్ఫార్మెన్స్

Advertisement